ETV Bharat / state

మరో హామీని నెరవేర్చిన నారా లోకేశ్ - సంబరాలు చేసుకున్న ప్రజలు

మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించిన కేబినేట్

Mangalagiri Government Hospital is Being Developing with 100 Beds
Mangalagiri Government Hospital is Being Developing with 100 Beds (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Mangalagiri Government Hospital is Being Developing with 100 Beds : ఎన్నికల సమయంలో యువ నాయకుడు లోకేశ్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా హామీలను అమలు చేసిన లోకేశ్ తాజగా మరో హామీని అమలు చేసి చూపించారు. యువగళం పాద యాత్రలో భాగంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని నియోజవర్గం ప్రజలకు మాటిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. దీంతో మంగళగిరి ప్రజల చిరకాల కల నెరవేరనుంది.

దేశంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరిగిందంటే వెంటనే మంగళగిరి గుర్తొచ్చేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గం ప్రజల సంతోషం వ్యక్తం చేశారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంగళగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. కాలక్రమేణా ఆసుపత్రి నిరాదరణకు గురి కావడంతో కేవలం ఓపి సేవలకు మాత్రమే పరిమితమైంది.

ఏపీలో పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి - మంత్రి లోకేశ్​తో భేటీ

చాలా సంవత్సరాల నుంచి మంగళగిరి ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలంటూ ప్రజలు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి డిమాండ్ చేస్తున్నారు. వివిధ సందర్భల్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎంతో మంది పాలకులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఎటువంటి లాభం జరగలేదు. కానీ మంత్రి నారా లోకేశ్ మాత్రం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతామని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నాలుగు నెలల్లోనే లోకేశ్ హామీని అమలు చేసి చూపించాడు. మంత్రి లోకేశ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చారని సాధన సమితి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మంత్రికి విన్నవించారు. ఆనాడు తాత ప్రారంభిస్తే నేడు ఆయన మనవడు అదే ఆసుపత్రి స్థాయి పెంచేందుకు కృషి చేస్తున్నారని లోకేశ్​ను కొనియాడారు.

లోకేశ్ దిల్లీ టూర్ అప్డేట్స్ - 'ఇతర రాష్ట్రాలతో కాదు- దేశాలతోనే మాకు పోటీ'

'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్​లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.