Manchu Mohan Babu Tweet About High Court Petition : సినీ నటుడు మంచు మోహన్‌బాబు మరోసారి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించలేదంటూ పోస్టు చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని మోహన్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవాలను మాత్రమే మీడియా ప్రచారం చేయాలని కోరారు.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేస్తూ తన ముందస్తు బెయిల్‌పై స్పష్టత ఇచ్చారు. ఓ ఛానల్ ప్రతినిధిపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించినట్లు ప్రచారం జరగడంతో తాజాగా మంచు మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు. అవాస్తవాలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.
— Mohan Babu M (@themohanbabu) December 14, 2024
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం కవరేజ్‌కి వచ్చిన ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పహాడిషరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
కొట్టింది వాస్తవమే - ఏ సందర్భంలో జరిగిందో ఆలోచించాలి: మోహన్‌బాబు
Mohan Babu Audio : తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని నటుడు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటనను తరువాత రోజు విడుదల చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా ఇది ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలని అన్నారు.
మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించానని, అది కూడా చీకట్లో ఘర్షణ జరిగిందని తెలిపారు. తాను కొట్టిన దెబ్బ మీడియా ప్రతినిధికి తగలడం బాధాకరమని అన్నారు. ఆ మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటివాడని సంభోదించారు. అతని భార్యాబిడ్డల గురించి ఆలోచించానని, కానీ నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదని అన్నారు. సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదని మోహన్‌బాబు అన్నారు.
'నా పరువు, ప్రఖ్యాతలు మంటగలిపావు మనోజ్' - మోహన్‌బాబు ఆడియో
నా భద్రత గురించి భయంగా ఉంది - మంచు మనోజ్‌పై పోలీసులకు మోహన్‌బాబు ఫిర్యాదు