Manchu Manoj Family At Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు పర్యటించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభ నాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఈ క్రమంలో వారు శోభ నాగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సోమవారం హైదరాబాద్ నుంచి పెద్ద కాన్వాయ్‌తో ఆయన 40వ జాతీయ రహదారి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వీరి రాకను పురస్కరించుకొని స్థానికంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచు కుటుంబం వివాదం ఇంకా ముగియలేదు. తాజాగా వారి వివాదంలో మరొక అంశం తెరపైకి వచ్చింది. మనోజ్ తాజా స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం. తన ఫ్యామిలీలో చోటుచేసుకున్న ఘటన గురించి శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఇంటి వద్ద జనరేటర్‌లో విష్ణు పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. దీంతో వారి వివాదం ఇంకా కొలిక్కి రాలేదని అర్థమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘జనరేటర్‌లో పంచదార - నిలిచిన విద్యుత్ సరఫరా' - మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ
అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్‌బాబు - తిరస్కరించిన హైకోర్టు