Man Offered Lift On Bike Fake Police Threatened And Robbed Money : రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తికి మానవతా దృక్పథంతో బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఏకంగా రూ. 26 వేలు పోగొట్టుకున్నాడో యువకుడు. అంతేగాక గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరించి అతడి వద్ద దొరికిన కాడికి దోచుకుంది ఓ ముఠా. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉప్పల్‌కు చెందిన భరత్ ఓ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై నాగారం నుంచి ఉప్పల్‌కు వెళ్తున్నాడు. అదే సమయంలో విజయ సేల్స్ సమీపంలో ఓ వ్యక్తి నిల్చోని రాంపల్లి వరకు లిఫ్ట్ ఇవ్వమని కోరాడు.
ఇద్దరం గంజాయి వ్యాపారం చేస్తాం : సరే అని భరత్ తన బైక్‌పై అతన్ని ఎక్కించుకొని వెళ్తుండగా రాంపల్లి చౌరస్తా వచ్చేసరికి మరో వ్యక్తి వీరి బైక్‌ను ఆపాడు. తరువాత తను పోలీసునని చెప్పాడు. బండి దిగండి ఎక్కడికి వెళ్తున్నారు? అంటూ ఇద్దరినీ తనిఖీ చేశాడు. ఇంతలో లిఫ్ట్ అడిగి ఎక్కిన వ్యక్తి తన వద్ద ఉన్న ఒక కవర్ ఇచ్చి మేము ఇద్దరం కలిసి గంజాయి వ్యాపారం చేస్తామని ఆ నకిలీ పోలీసుకు చెప్పాడు. దీంతో భరత్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకున్న భరత్ తనకు ఎటువంటి సంబంధం లేదు, లిఫ్ట్ అడిగితే ఇచ్చానని వాదించినా నమ్మలేదు.
నోట్ల కట్టల బదులు వాటర్ బాటిళ్లు- చోరీ కేసును పోలీసులు కేసును ఎలా ఛేదించారంటే!
రూ.26 వేలు లాక్కున్నారు : ఈ క్రమంలోనే గంజాయి కేసులో ఇరికిస్తానని భరత్‌ను ఆ నకిలీ పోలీసు బెదిరించాడు. అనంతరం భరత్‌ను కొట్టి అతని వద్ద నుంచి రూ.26 వేలు లాక్కున్నారు. అనంతరం బాధితుడి బైక్ పైనే చిర్యాలు బస్టాప్ వరకు వచ్చి అక్కడ నిందితులిద్దరూ దిగిపోయారు. కొద్దిసేపటి తరువాత తను మోసపోయినట్లు భరత్ గ్రహించాడు. దీంతో మరుసటి రోజు కీసర పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం గురించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
డైరెక్టర్ ఇంట్లో సర్పంచ్ భర్త చోరీ- దొంగతనం చేసి పేదలకు పంచుతూ! - Director Joshiy House Theft