ETV Bharat / state

YUVA : కుటుంబ ఆలనా పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - Student five Jobs got in Telangana - STUDENT FIVE JOBS GOT IN TELANGANA

Man Got five Govt Jobs in Telangana : జీవితంలో ఎదగాలని పట్నం బాట పట్టాడా ఓ యువకుడు. కానీ, ఆర్థిక ఇబ్బందులతో కొద్ది రోజులకే ఇంటికి చేరాడు. అయితేనేం సామాజిక మాధ్యమాలే వారథిగా చేసుకుని సరైన ప్రణాళిక వేసుకున్నాడు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ పుస్తకాలతో కుస్తీ పట్టాడు. ఫలితంగా ఒకే ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు దుష్యంత్.

Successful Story of Dushyant from Suryapet
Dushyant Got Five Govt Jobs in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 5:20 PM IST

Updated : May 21, 2024, 5:25 PM IST

YUVA : ఇన్నాళ్లకు కల నెరవేరింది కుటుంబ ఆలనా పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు (ETV Bharat)

Man Got five Govt Jobs in Telangana : వ్యవసాయంలో తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఓ యువకుడు. చదువుకోవాడానికి సరైన వసతులు లేకపోయిన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు సహకరించపోయిన ఎక్కడ వెనుకడుగు వేయలేదు. కుటుంబానికి ఆసరాగా ఉంటూనే లక్ష్య సాధన దిశగా శ్రమించాడు. ఫలితంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు.

Successful Story of Dushyant from Suryapet : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన యవకుడి పేరు దుష్యంత్. తల్లిదండ్రులు పప్పుల వెంకటేశ్వర్లు, విజయ వ్యయసాయ కూలీలు. దుష్యంత్‌కి ఇద్దరు అక్కలు ఉన్నారు. తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని భావించి తల్లిదండ్రులు కుమార్తెలను, కుమారుడిని ఉన్నత చదవులు చదివించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఎదురొడ్డి జేఎన్​టీయూ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు దుష్యంత్‌.

YUVA : 2 ఏళ్లలో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - చదివింది ప్రభుత్వ బడుల్లోనే - 6 GOVT JOBS IN 2 YEARS

Govt JOBS For Persons Success Stories : చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన దుష్యంత్ ఎలాగైనా సరే ఉన్నత స్థాయికి చేరాలని కలలు కన్నాడు. ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదివినా మంచి మార్కులతో ప్రతిభ కనబరిచాడు. అలాగే ఇంజనీరింగ్‌ తర్వాత గేట్‌ కోసం సన్నద్ధం అవుతుంటే కొవిడ్‌ కారణంగా కోచింగ్ కేంద్రాలన్నీమూతబడ్డాయి. దాంతో ఆన్‌లైన్‌లో గేట్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే మంచి మార్కులు రాలేదు. నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు.

సామాజిక మాధ్యమాలే వారథి : ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న దుష్యంత్‌ హైదరాబాద్‌కి వచ్చి సన్నద్ధం అయ్యే ప్రయత్నాలు చేశాడు. అయితే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వడంతో ఇంట్లోనే సొంతంగా ప్రిపరేషన్ మెుదలు పెట్టాడు. గేట్ కోసం ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌తోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. సామాజిక మాధ్యమాలను వారథిగా చేసుకున్నాడు. అలాగే తన స్వయంగా మెటీరియల్ తయారుచేసుకుని పోటీ పరీక్షల ముందు సమీక్షించుకున్నట్లు చెబుతున్నాడు.

ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - విజయ రహస్యం అదేనట - Man Got Three Government Jobs

Dushyant Five Govt Jobs Suryapet : పట్టుదలతో చదివిన దుష్యంత్‌ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ ఫలితాల్లో అదరగొట్టాడు. టీఎస్​పీఎస్సీ జనరల్ ర్యాంక్ లిస్ట్‌లో పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4, అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఎంపికైయ్యాడు. అలాగే టీఎస్ఎల్ఆర్బీ ఫైర్ కానిస్టేబుల్​గా 5వ ఉద్యోగాన్ని సాధించాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయం చేస్తూ ఏడాది వ్యవధిలోనే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు దుష్యంత్‌. తల్లిదండ్రులు ఇచ్చిన భరోసాతోనే ఇదంతా సాధ్యమైందని అంటున్నాడు. ఇక సివిల్స్‌ సాధించటమే తన అంతిమ లక్ష్యమని భవిష్యత్తులో ఆ కల తప్పక నెరవేరుతుందని ధీమాగా చెబుతున్నాడు.

"ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలని పెంచిపో షించాము. చదువుకోవడానికి సరైన వసతులు లేకపోయినా ఇబ్బందులు పడుతూ దుష్యంత్‌ సాధన చేశాడు. ఇప్పుడు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉంది." - విజయ, దుష్యంత్ తల్లి

కష్టాలను ఎదిరించి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - Man Got Three Govt Jobs At A Time

Last Updated : May 21, 2024, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.