Man giving Awareness about Water Crisis in Hyderabad : బెంగళూరులో నీటి ఎద్దడి ఎంత తీవ్రతగా ఉందో అక్కడి పరిస్థితులు అద్ధం పడుతోంది. ఆ పరిస్థితులు హైదరాబాద్లో పునరావృతం కాకుడదని, భాగ్యనగరం మరో బెంగళూరుగా మారకూడదని సంకల్పించాడు హైదరాబాద్కు చెందిన సాయికృష్ణ. క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపే నగరవాసులకు నీటి పొదువు ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని భావించాడు. అందుకోసం వినూత్నంగా ఆలోచించిన ఈ యువకుడు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్(Traffic Signals)ఉన్న ప్రధాన కూడళ్లను ఎంచుకున్నాడు.
ప్రతి నీటి చుక్క అమూల్యమైంది : 'దేశ భవితే సంకల్పం, ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇవ్వండి, భావితరాలకు నీరందించండి' అంటూ రాసిన ఫ్లెక్సీ(Flexi)ని చేత పట్టుకుని ట్రాఫీక్ సిగ్నల్స్ దగ్గర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నాడు సాయికృష్ణ. భవిష్యత్తులో హైదరాబాద్ మహా నగరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని సూచిస్తున్నాడు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకతను, ప్రతి చుక్క ఎంతో అమూల్యమైందిగా భావించాలని ప్రజలకు తెలియజేస్తున్నాడు.
ముందస్తుగా జల సంరక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల వర్షపాతం ఎక్కవగా నమోదయ్యే బెంగళూరు(Bengaluru)లోనే నీటి ఎద్దడి వచ్చిందంటే, కేవలం వర్షాకాలంలోనే వర్షం కురిసే హైదరాబాద్లో రానున్న రోజుల్లో పరిస్ధితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని సాయికృష్ణ కోరుతున్నాడు. నీటి వృథాను అరికట్టకపోతే భవిష్యత్తులో బెంగళూరు పరిస్థితులను భాగ్యనగరంలో ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఈ యువకుడు, తన విధులు ముగిసిన తరువాత సాయంత్రం నగరంలో ప్రతి రోజు వివిధ ప్రధాన కూడళ్ల దగ్గర వాహనదారులకు అవగహన కల్పిస్తున్నాడు.
Youth giving Awareness on Water Shortage : ముఖ్యంగా వాహన యజమానులు తమ వాహనాన్ని కడగడానికి నీటిని వృథా చేయవద్దని సాయికృష్ణ సూచిస్తున్నాడు. ఇళ్లు, అపార్ట్మెంట్ అవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఇంటి యజమానులు ప్రధాన్యం ఇవ్వాలని కోరుతున్నాడు. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఉండేందుకు తన వంతుగా కృషి చేస్తున్నట్లు ఈ యువకుడు చెబుతున్నాడు. తన వల్ల ఒక్కరైన మారి నీటి వృథా తగ్గించడం, పొదుపుగా నీటిని వాడుకుంటే తనకు అనందంగా ఉంటుందని అంటున్నాడు.
'నీళ్లు లేకపోతే అసలు జీవితం ఎక్కడ ఉంది మనకు. నా పోరాటం ద్వారా కొంత మందిలో అయిన మార్పు వచ్చి, ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇస్తే వాళ్లకు వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చే వేసలి కాలంలో కూడా ఉండవు. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరమైనది. నా ఆఫీస్ టైం అయిపోయాక ప్రతి సిగ్నల్స్ దగ్గర ఫ్లెక్సీతో అందరికీ అవగాహన కల్పిస్తున్నా.'- సాయికృష్ణ
బెంగళూరుతో పోలికొద్దు - హైదరాబాద్లో ఆ దుస్థితి రాదు : దానకిశోర్ - Water Crisis in Hyderabad
ఈ వేసవికి ఢోకా లేదు - భాగ్యనగరవాసులకు ప్రభుత్వం భరోసా - hyderabad Water board