ETV Bharat / state

కాటేసిన పాముతో ఆసుపత్రికి - బాధితుడి చెప్పిన కారణం విని వైద్యులు షాక్! - Man Came to Hospital With Snake

Man Brings Snake That Bit Him To The Hospital : వరంగల్​ జిల్లాలో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. తనను కరిచిన పామును సంచిలో వేసుకొని ఓ వ్యక్తి వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. కరిచిన పాము ఒకటై, చేసే వైద్యం మరొకటైతే తన ప్రాణం ఎక్కడ పోతుందో అని భావించిన ఆ వ్యక్తి, ఏకంగా ఆ పామును చంపి, వైద్యులకు చూపిస్తూ హల్​చల్ సృష్టించాడు.

Snake Bite Crazy Incident
Man Came to Hospital With Snake
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 10:59 AM IST

కాటేసిన పాముతో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి - బాధితుడి తీరుకు వైద్యులు షాక్!

Man Brings Snake That Bit Him To The Hospital : వరంగల్ జిల్లాలో పాముకాటుకు గురైన ఓ వ్యక్తి మతిపోయే పని చేశాడు. పాము కరిచిందని ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ఏ పాము కుట్టింది ఏంటి అనే ప్రశ్నలు వేసి తికమక పెడతారేమో అని ముందుగానే ఊహించాడు. అందుకు అనుగుణంగా తనను కరిచిన పామును చంపి మరీ సంచిలో వేసుకొని వైద్యం(Doctors Treatment) కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు.

కరిచిన పాము ఒకటై, చేసే వైద్యం మరొకటైతే తన ప్రాణం పోతుందని భయపడిన ఆ వ్యక్తి తనను కరిచిన పామును చంపి అడిగిన వైద్యులకు చూపిస్తూ వారికి షాక్ ఇచ్చాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. బండౌతపురం గ్రామానికి చెందిన నక్క రాజల్లు అనే వ్యక్తి గొర్రెలు కాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజులాగే ఆదివారం రోజున కూడా ఓ చెరువు సమీపంలో గొర్రెలను కాస్తున్నాడు.

కాటేసిన పాముతో ఆస్పత్రికి- ఇంజెక్షన్​ చేయండంటూ హాస్పిటల్​లో హల్​చల్​!

Warangal Snake Bite Crazy Incident : ఎండ ఎక్కువగా ఉండడంతో ఓ చెట్టు కింద కాసేపు అలా నడుం వాల్చాడు. చెట్టుపై నుంచి గుర్తు తెలియని పాము ఒక్కసారిగా కింద నిద్రిస్తున్న రాజల్లుపై పడింది. తనపై ఏదో పడటంతో నిద్రలో నుంచి చటుక్కున లేచిన గొర్రెల కాపరి, పామును చూసి విసిరేసే లోపలే అది అతడి చేతిపై కాటు వేసింది. అతడు పామును చంపి, దానిని ఓ సంచిలో వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి వైద్యం కోసం వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు ఓ ఇంజిక్షన్ వేసి సెలైన్​ పెట్టి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

అయితే తనను కరిచిన పామును చంపి మరీ వెంట పెట్టుకుని వచ్చిన రాజల్లును చూసి వైద్యులు షాక్ అయ్యారు. అయితే ప్రాణ భయంతోనే అలా చేశాడని తెలిశాక అలా చేయడంలో తప్పేం లేదు కదా అనుకున్నారు. అక్కడితో ఆగక రాజల్లు రాయపర్తి మండలం కొండాపురం నాటు వైద్యం కోసం వెళ్లాడు. కాటు వేసిన చోట చెయ్యి వాపు(Hand Swelling) వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఆరోగ్య నిలకడగానే ఉన్నట్లు కుంటుంబ సభ్యులు తెలిపారు.

"చెట్టు కింద సేదతీరుతున్నప్పుడు, ఎక్కడ నుంచి పాము వచ్చిందో తెలీదు. కానీ ఒక్కసారిగా నాపైన పడి కాటేసింది. వెంటనే దానిని చంపి, సంచిలో వేసుకొని ఆసుపత్రికి వెళ్లాం. కరిచిన పాము ఒకటై, చేసే వైద్యం మరొకటైతే నా ప్రాణం ఎక్కడ పోతుందో అని భావించే ఇలా చేశాను."-నక్క రాజల్లు , బాధితుడు

ఫినాయిల్​ దాడితో మూర్ఛపోయిన నాగుపాము- ఆక్సిజన్​ ఇచ్చి వైద్యుల ట్రీట్​మెంట్​

Viral Video : పాముకు ఊపిరి ఊది.. బతికించిన పోలీస్..! వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.