ETV Bharat / state

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక కాంగ్రెస్​కు మామూలుగా ఉండదు : మాజీ మంత్రి మల్లారెడ్డి - BRS Leaders Meeting Today

Malla Reddy Shocking Comments on Parliament Elections 2024 : లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. తాము రాష్ట్రం అభివృద్ధి చేశాం కనుకే అప్పుల పాలు అయ్యామని స్పష్టం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 8:15 PM IST

Updated : Jan 22, 2024, 12:58 PM IST

Malla Reddy Shocking Comments on Parliament Elections 2024 : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్​ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్​ తెలంగాణ ప్రజలను మోసం చేశారా అని ప్రశ్నించారు. ఆయనకు హైదరాబాద్​లో ఇళ్లు కూడా లేదని, రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చూసినా అందులో కేసీఆర్ కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్(BRS Leader KTR) ఐటీ మంత్రిగా లేకపోవడాన్ని చూసి ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. అభివృద్ధి చేసినందుకే అప్పులయ్యాయన్న మల్లారెడ్డి, మీరు అధికారంలోకి వస్తారని మేము కలలు కని అప్పుల పాలు చేశామా అని ప్రశ్నించారు.

మల్కాజ్​గిరి లోక్​సభ స్థానం నుంచి పోటీకి రెడీ - ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానం : మల్లారెడ్డి

Malla Reddy Fire on Congress : లంకె బిందెలు ఉంటే మింగాలని అనుకున్నారా అని మల్లారెడ్డి(Ex Minister Malla Reddy) అన్నారు. పరిపాలన రావాలి తప్ప, కావాల్సింది డబ్బులు కాదని అన్నారు. కాంగ్రెస్​కు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చాడని, ఏం చేయాల్సిన పనులు లేవని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజూ చర్చలే కానీ, ప్రజలకు చేసిందేమీ లేదని మల్లారెడ్డి మండిపడ్డారు.

ఐటీ మంత్రిగా కేటీఆర్ లేకుంటే ప్రజలు భరించలేకపోతున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా కేసీఆరే కనిపిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరని ప్రజలు బాధపడుతున్నారు. అభివృద్ధి చేశాం. అందుకే అప్పులు అయ్యాయి. రాష్ట్రంలో పరిపాలన చేయాలి. డబ్బులు కాదు కావాల్సింది. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. - మల్లారెడ్డి, మాజీ మంత్రి

రాజకీయ కక్ష సాధింపుతోనే నాపై కేసులు - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy on Parliament Elecctions 2024 : ఎక్కడైనా కరెంట్ పోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా అని అంటున్నారని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ప్రజలకు అన్నీ అర్థం అయ్యాయని అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ 16 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అక్షింతలు పంచుతున్నారు తప్ప, రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.(Malla Reddy Latest Comments on BJP). కాంగ్రెస్​కు మిగిలినవి రెండు రాష్ట్రాలే అన్న మల్లారెడ్డి, మోదీ మూడోసారి ప్రధాని అయితే వాటిని కూడా మింగేస్తారని తెలిపారు. మల్కాజిగిరి లోక్​సభ అభ్యర్థి విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. అధిష్టానం మల్లారెడ్డి పోయి బాయిలో దూకమని చెబితే, దూకుతానని అన్నారు.

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక కాంగ్రెస్​కు మామూలుగా ఉండదు మాజీ మంత్రి మల్లారెడ్డి

నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి

Last Updated : Jan 22, 2024, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.