ETV Bharat / state

ఏకశిలతో మహాత్ముడి విగ్రహం - ఆ జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా గాంధీ గుడి! - Mahatma Gandhi Jayanti 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Mahatma Gandhi Temple in Narasaraopet: మహాత్మాగాంధీ అహింస అనే ఒకే ఒక్క మాటతో కోట్లాది మందిని శాంతి మార్గంలో నడిపించిన మహనీయుడు. స్వాతంత్య్ర సమరంలో దేశానికి విజయం అందించిన పోరాట యోధుడు. అలాంటి మహానీయుడి విగ్రహాలను ఊరురా, వాడవాడలా ఏర్పాటు చేసుకుని స్మరించుకుంటోంది యావత్‌ భారతదేశం. జాతిపితను వీధుల్లో విగ్రహాలకే పరిమితం చేయకుండా ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపూజీ గుడి నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు.

Mahatma Gandhi Temple in Narasaraopet
Mahatma Gandhi Temple in Narasaraopet (ETV Bharat)

Mahatma Gandhi Temple in Narasaraopet : దేశంలో రామాలయం లేని ఊరు, గాంధీ మహ్మాతుడి విగ్రహం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే దేశ విదేశాల్లోనూ గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన సేవలను స్మరించుకుంటున్నాం. విశ్వమంతా ఖ్యాతిని సొంతం చేసుకున్న ఆ మహానీయుడిని వీధుల్లోని విగ్రహాలకే పరిమితం చేయకుండా . దేవుడిలా కొలవాలనే తలంపుతో గాంధీ ఆలయాన్ని కట్టాలని సంకల్పించింది మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్.

Mahatma Gandhi Jayanti 2024 : పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో బాపూజీ గుడిని నిర్మించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి భక్తులకు గాంధీ మహ్మాతుడిని దర్శనానికి స్వరం సిద్ధం చేసింది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అన్నివర్గాల వారు గాంధీజీ ఆశీస్సులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్‌ అధ్యక్షుడు భూపాల్‌ రెడ్డి తెలిపారు.

గాంధీ మహాత్మా! మీ లాంటి ఓ వ్యక్తి ఈ భూమ్మీద తిరిగారంటే భావితరాలు నమ్ముతాయా? - Mahatma Gandhi Jayanti 2024

హింసకు చరమగీతం : వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి, జయంతి, వర్దంతి రోజున దండలు వేసి దండం పెట్టుకోవడం కాకుండా అనునిత్యం మహాత్మా గాంధీని స్మరించుకునేందుకు వీలుగా ఈ గాంధీ గుడిని నిర్మించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గాంధీ అనే రెండు అక్షరాలకు భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం, గౌరవం ఉందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.

మహాత్మా గాంధీ ముందు తరం వరకూ పోరాటంలో గెలవాలన్నా, యుద్ధంలో నెగ్గాలన్నా రక్తం చిందించాల్సిందేనని, ప్రాణాలను బలి ఇవ్వాల్సిందేనని, ఆ ఒరవడికి ముగింపు పలికిన మహానేత గాంధీ అని తెలిపారు. హింసకు చరమగీతం పాడుతూ, అహింస మార్గంలోనూ అనుకున్నది సాధించవచ్చునని నిరూపించిన గొప్ప మార్గదర్శిగా గాంధీని అభివర్ణిస్తున్నారు. ఆయన మార్గాన్ని అనుసరించేలా యువతను ప్రోత్సాహించేందుకు ఈ గుడిని వారధిగా ఎంచుకున్నామనేది నిర్వాహకుల మాట.

Azadi Ka Amrit Mahotsav: ఆఖరి జన్మదినాన గాంధీ ఏం సందేశమిచ్చారు?

ఏకశిలతో మహాత్మడి విగ్రహం : స్వాతంత్య్ర సాధన ద్వారా సరికొత్త చరిత్ర లిఖించిన జాతిపితను దేవుడిగా పూజించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళిగా ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అందుకే మహాత్మాగాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కోసం ఆళ్లగడ్డ నుంచి ప్రత్యేక ఏకశిలను తెప్పించి, దుర్గిలోని నాగార్జున శిల్పాకళలో తయారు చేయించినట్లు చెబుతున్నారు. నిత్యం గాంధీ గుడిలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు, భావితరాలకు మహ్మాతుడి ఉద్యమస్ఫూర్తిని తెలిపే విధంగా తమ ప్రాంతంలో ఆలయం నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాహాత్ముడి జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు జరుపుతున్నారు.

Gandhi Jayanti 2021: గాంధీపై వచ్చిన ఈ పాటలు చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.