ETV Bharat / state

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు - శివరాత్రి వేడుకలు

MahaShivaratri Brahmotsavalu in Srisailam: మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు.

MahaShivaratri Brahmotsavalu in Srisailam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 12:31 PM IST

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

MahaShivaratri Brahmotsavalu in Srisailam: మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం విద్యుత్ దీపాల అలంకరణలతో శోభాయమానంగా మారింది. వేడుకల్లో దేవుళ్ల వేష ధారణలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కైలాస క్షేత్రం భక్త జనంతో నిండిపోయింది. నడక మార్గంలో వచ్చే భక్తులు బారులు తీరుతున్నారు. నల్లమల ప్రాంతం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు, వేద పండితులు వేదమంత్రాల అర్చణలతో విశేష పూజలు నిర్వహించారు.

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శ్రీశైలం

Srisailam Mallikarjuna Swamy Temple: మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్య సందడి నడుమ మల్లికార్జునస్వామి అమ్మవార్లను గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. శ్రీకృష్ణ దేవరాయగోపురం నుంచి నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం శోభాయానంగా జరిగింది. వేలాది మంది భక్త జనం స్వామి అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకొని ఆనంద పరవశులయ్యారు. ఆచార సంప్రదాయంలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్‌ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్నకు సారె

Srikalahasteswara Temple in Tirupati District: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పరిశీలించారు. 1200 మంది పోలీసులతో భద్రత కల్పించడంతో పాటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. నంద్యాల జిల్లా మహానందిలో ఉత్సవమూర్తులు పల్లకిలో నంద్యాలకు చేరుకున్నారు. బ్రహ్మానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులతో కలిసి మహానందికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యలలోని పలు వీధుల్లో గ్రామోత్సవం చేపట్టి తిరిగి మహానందికి బయల్దేరారు.

వైభవంగా మల్లేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు: నేటి నుంచి దర్శనాలు

SP Inspected The Brahmotsavam Arrangements: కోటి సూర్యప్రభల తేజంతో ప్రభవించిన సూర్య నారాయణుడి ప్రభలపై సోమస్కందమూర్తి రాజసాన్ని ప్రదర్శిస్తూ దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తజన బాంధవుడైన సోమస్కందమూర్తి ఆదిత్యుని దివ్య ప్రభలను ప్రత్యేక అలంకారంలో జ్ఞానాంబిక వాహనంగా చేసుకున్నారు. చప్పరంలో కొలువుదీరిన జ్ఞానాంబికతో కలిసి పురవీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గణేషుడు, శ్రీవల్లీ, దేవయాని సమేత చెంగల్వరాయస్వామి, భక్త కన్నప్ప, చండికేశ్వరుని ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఊరేగారు. వృష భరాజాలు, కోలాటాలతో చతుర్మాడ మిరుమిట్లు గొలుపుతున్న వెలుగుల్లో ఆలయం, గోపురాలు, వీధులు పులకించిపోయాయి. గ్రామీణ ప్రాంత కళాకారుల కోలాటాలు, ప్రత్యేక వాయిద్యాలు, శివ భక్తుల నాట్యాలు, వేదపండితుల మంత్రఘోష, మేళతాళాల మధ్య దేవదేవుని ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.

శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం - కానుక సమర్పించిన ఎంపీ వేమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.