ETV Bharat / state

దస్త్రాలు భద్రంగా ఉన్నాయా? - రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి సమీక్ష - Madanapalle case updates

Madanapalle Case Updates: మదనపల్లె దస్త్రాల దహనం ఘటనపై 3 జిల్లాల రెవెన్యూ అధికారులతో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి సిసోదియా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయాల్లో దస్త్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో భద్రపరిచి కాపలా పెట్టాలని సూచించారు.

Madanapalle Case Updates
Madanapalle Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 11:50 AM IST

Madanapalle Sub Collector Office Fire Accident Case : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం ఆయన ఘటనకు సంబంధించి నాలుగో రోజు విచారణ ముమ్మరంగా సాగుతోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోదియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తహశీల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనేకమంది వైఎస్సార్​సీపీ బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ బాధలు వెళ్లగక్కారు. దీంతోపాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనకు సంబంధించి ఇటు రెవిన్యూ శాఖ అధికారులు, పోలీసులు నాలుగో రోజు కూడా విచారణ వేగవంతంగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఈ ఘటనపై ఆరా తీస్తోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసోదియా సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్టర్లు రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆర్డీవోలు తహశీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు.

చుక్కల భూములు, 22ఏ ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా? లేదా? అనేదానిపై ఆరా తీశారు. గడచిన మూడేళ్ల కాలంలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై చర్చించారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూముల పైన సిసోదియా సంబంధిత రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఏ ఏ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ కన్వర్షన్ ఏవిధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోసారి మంచిమనసు చాటుకున్న మంత్రి లోకేశ్‌ - ఓమన్‌లో చిక్కుకున్న మహిళకు భరోసా

కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీసీ సోడియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయనకు అర్జీలు ఇవ్వడానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బాధితులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎక్కువగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు, వైఎస్సార్​సీపీ బాధితులందరూ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదులు అందజేశారు. గడిచిన మూడేళ్లుగా వైఎస్సార్​సీపీ నాయకులు తమ భూములను బలవంతంగా లాగేసుకున్నారని ఇదేమని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. రెవెన్యూ అధికారుల సమీక్ష ఓవైపు జరుగుతుండగానే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోవైపు జిల్లా పోలీస్ అధికారులతో కేసు పురోగతికి సంబంధించి సమీక్ష నిర్వహించారు.

జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు డీఎస్పీలు, సీఐలతో కేసు వివరాలపై ఆరా తీశారు. అగ్నిమాపక శాఖ అధికారులు క్లూస్ టీం సిబ్బందితో కూడా సమావేశమై ఎంతవరకు పురోగతి వచ్చిందని దానిపై ఆరా తీశారు. ఇప్పటికే 35 మంది అనుమానితులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి కాల్ డేటా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్యలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా దోచుకున్నారు - విచారణ తరువాత చర్యలు తప్పవు: మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Ravindra on Illegal Mining

ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్​ ఫోకస్ - రేపు శ్వేతపత్రం విడుదల - White Paper on Finance Department

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.