Dog Attack On Public In Gooty 8 Injured : అనంతపురం జిల్లా గుత్తిలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. పట్టణంలోని టమోటా మార్కెట్ వీధిలో ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి 8 మందిని గాయపరిచింది. కుక్కను తరిమేందుకు వెల్లిన వారిపై కూడా దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారందరూ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కాలనీకి చెందిన యువకులందరూ కర్రలతో పిచ్చి కుక్కను కొట్టి చంపేశారు. కాలనీలో మనుషులతో పాటు కుక్కలు, కోళ్లపై కూడా దాడి చేసిందని కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పిచ్చికుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
వీధి కుక్కల బెడద భరించలేనంతగా పెరిగిపోతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం ఏదో ఒక వీధిలో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అని తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించిన చోట వీధి కుక్కలు వెంటాడుతూ కరుస్తూనే ఉన్నాయని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
పిచ్చికుక్క దాడిలో 20మందికి గాయాలు- ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
Bear Attack on Farmer in Anantapur District : అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కంబాలపల్లిలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయాన్నే చింతచిగురు కోసం వెళ్లిన హనుమంతరాయుడుపై దాడిచేసి గాయపరిచింది. మోకాళ్ల వద్ద, వీపు పైన గోళ్లతో రక్కడంతో గాయమైనట్లు హనుమంతరాయుడు చెప్పారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తరచూ ఎలుగుబంట్లు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు ఎలుగుబంట్ల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Street Dogs Attack On Forest Duppi in Nandyala District : నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టేపల్లి గ్రామ శివారులో నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చుక్కల దుప్పిపై వీధి కుక్కల దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకొని దుప్పి గ్రామంలోకి వచ్చి ఓ ఇంటి బాత్రూం లోకి దూరింది. గ్రామస్తులు కుక్కలను తరిమి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గాయపడిన చుక్కల దుప్పికి వైద్య చికిత్స అందించి అడవిలోకి వదలనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.