ETV Bharat / state

మీకు గ్యాస్ సబ్సిడీ రావట్లేదా? - ఇంకా కేవైసీ పూర్తి చేయలేదా? - ఇలా చేయండి! - LPG e KYC Process in Online

LPG Gas Subsidy : మీకు గ్యాస్ డెలివరీ తర్వాత కేంద్ర సర్కార్ అందించే సబ్సిడీ డబ్బులు పడట్లేదా? అలాగే ఆ స‌బ్సిడీ డబ్బు ప‌డిందా లేదా అన్న‌ది ఎలా చెక్ చేసుకోవాలో తెలియ‌డం లేదా? అదేవిధంగా మీరు ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..

LPG Gas
Gas Subsidy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 3:03 PM IST

LPG Gas Subsidy Update : కేంద్ర ప్రభుత్వం ఎల్​పీజీ గ్యాస్ వినియోగదారులకు కొంతమేర సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా వంటగ్యాస్ వాడేవారు సిలిండర్ బుక్ చేసి డెలివరీ అయిపోయిన తర్వాత ఈ రాయితీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ అవుతాయి. అయితే కొంతమందికి పలు కారణాల వల్ల సబ్సిడీ పడకపోవచ్చు. అలాగే కొందరికి సబ్సిడీ వచ్చినా అకౌంట్​లో ఎన్ని డబ్బులు పడ్డాయో చెక్ చేసుకోవడం తెలియదు. అదేవిధంగా ఇప్పటికీ ఈ-కేవైసీ(LPG e-Kyc) ప్రక్రియను పూర్తి చేయనివారు ఉంటే ఇప్పుడే ఈజీగా ఇంటి వద్ద నుంచే ఆ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gas Subsidy Check Online : చాలా మందికి గ్యాస్ సిలిండ‌ర్‌పై వ‌చ్చే స‌బ్సిడీని ఎలా చెక్ చేసుకోవాలో చేయాలో తెలియ‌దు. అలాంటి వారు ఈజీగా ఫోన్​లో మీకు ఎంత సబ్సిడీ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే దీనికోసం ముందుగా మీ ఎల్​పీజీ ఐడీ తెలుసుకొని ఆ తర్వాత సబ్సిడీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం..

  • మీరు ముందుగా http://mylpg.in/ వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • అక్కడ పైన కుడి వైపున మీ LPG IDకి సంబంధించిన వివ‌రాలు తెలుసుకునే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ గ్యాస్ కంపెనీ పేరు అడుగుతుంది. అక్కడ కనిపించే ఆప్షన్లలో మీరు వాడే కంపెనీ ఎంచుకోవాలి.
  • ఆ త‌ర్వాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్క‌డ మీ ఫోన్ నంబ‌రు లేదా గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూట‌ర్ పేరు, వినియోగ‌దారుని నంబ‌రు వంటి వివ‌రాలు అడుగుతోంది. అవి పూర్తి చేయాలి.
  • అనంతరం అక్క‌డ క‌నిపించే captcha code (క్యాప్చా కోడ్) ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి. ఇలా చేసిన త‌ర్వాత మీకు LPG ID వ‌స్తుంది.
  • ఇప్పుడు ఈ స్టెప్స్ ద్వారా గ్యాస్ సబ్సిడీ తెలుసుకోవచ్చు..
  • మ‌ళ్లీ మీరు పైన తెలిపిన వెబ్​సైట్ ఓపెన్ చేసి.. పైన కుడి వైపున క‌నిపించే ఖాళీల్లో మీ LPG ID ఎంట‌ర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్ట‌ర్డ్ ఫోన్ నంబ‌రు నమోదు చేసి.. ఆపై అక్క‌డ క‌నిపించే captcha నింపాలి.
  • ఇదంతా చేసిన త‌ర్వాత మీ ఫోన్​కు ఓటీపీ వ‌స్తుంది. దానిని ఫిల్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్క‌డ మీ ఈమెయిల్ ఐడీ ఎంట‌ర్ చేసి ఒక పాస్ వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
  • ఆ త‌ర్వాత మీ ఈ-మెయిల్​కు యాక్టివేష‌న్ లింక్ వ‌స్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
  • ఆపై ఒక‌సారి http://mylpg.in/ ఓపెన్ చేసి మీ అకౌంట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయ్యాక అక్క‌డ View Cylinder Booking History / subsidy transferred ఆప్ష‌న్లపై క్లిక్ చేసి ఈజీగా మీ స‌బ్సిడీ వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

రూ.500కే గ్యాస్​ సిలిండర్​ హామీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం - వీరే అర్హులు!

ఆన్‌లైన్​లో గ్యాస్ ఈ-కేవైసీ పూర్తి చేసుకోండిలా..

  • మీరు ముందుగా ఎల్‌పీజీ గ్యాస్ అధికారిక వెబ్‌సైట్ www.mylpg.in లోకి వెళ్లాలి.
  • అప్పుడు అక్కడ కుడివైపు పైన భారత్ గ్యాస్/HPగ్యాస్/ఇండేన్ సిలిండర్​ బొమ్మలు కనిపిస్తాయి. అప్పుడు అందులో మీ గ్యాస్ ఏ కంపెనీది అయితే.. దానిపై నొక్కాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయిన కొత్త పేజ్​లో కుడివైపు పైన Sign In, New User ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే మొబైల్ నంబర్‌తో Sign In అవ్వాలి. లేదంటే 'New User' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
  • New User పేజ్​లోకి వెళ్లాక గ్యాస్ కన్య్జూమర్ నంబర్ సహా.. అడిగిన వివరాలన్నీ సబ్మిట్ చేయాలి.
  • అనంతరం ఐడీతో లాగిన్ అవ్వాలి. అప్పుడు మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాలన్నీ స్క్రీన్​పై డిస్​ప్లే అవుతాయి.
  • అప్పుడు ఎడమ వైపు కనిపించే 'ఆధార్ అథెంటికేషన్' అనే ఆప్షన్ ఎంచుకొని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ అక్కడ నమోదు చేసి అథెంటికేషన్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి.
  • అంతే ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ పూర్తియినట్లు ఫోన్​కు మెసేజ్ వస్తుంది.
  • ఒకవేళ మీరు KYC స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే.. మరోసారి 'ఆధార్ అథెంటికేషన్' ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • అప్పుడు ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేశారనే సందేశం వస్తుంది.
  • ఒకవేళ మీరు ఆఫ్‌లైన్​లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటే.. కేవైసీ ఫారమ్ నింపి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో మీ KYC ప్రక్రియ పూర్తవుతుంది.
  • లేదంటే గ్యాస్ డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు అతని ద్వారా మీరు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

మీ సిలిండర్​లో గ్యాస్ ఎంత మిగిలి ఉంది? - ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.