ETV Bharat / state

లారీ డ్రైవర్​కు నెలకు రూ.10 లక్షల ఆదాయం! - ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా? - Truck Driver Turns Influencer

Lorry Driver YouTube Income : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్​లో వీడియోలు చేస్తున్నారు. కానీ అందరిలో కొందరే అందులో క్లిక్​ అవుతున్నారు. ఇప్పుడు చెప్పే ఈ లారీ డ్రైవర్​కు చదువురాదు, టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు. కానీ 19 లక్షల మంది సబ్​స్క్రైబర్లతో నెలకు అక్షరాలా రూ.10 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఏం చేసి అంత మొత్తం సంపాదిస్తున్నాడు అనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Lorry Driver YouTube Income
Lorry Driver YouTube Income (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 10:00 AM IST

Updated : Aug 24, 2024, 10:39 AM IST

Lorry Driver YouTube Earnings 10 Lakhs per Month : ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయాయి. యూట్యూబ్, వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా వంటి వాటిల్లో గంటల కొద్దీ సమయం గడిపే వారు ఎందరో ఉన్నారు. అయితే వాటితోనే కొందరు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. తాము చేసే పనినే వీడియోలు తీస్తూ, వాటిని సోషల్​ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో పాటు ఆదాయమూ పొందుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ రాజేశ్​ రవానీ కూడా ఈ కోవకు చెందినవాడే. వృత్తి రీత్యా లారీ డ్రైవర్​గా పని చేస్తున్న ఈ ఝార్ఖండ్​ డైనమైట్,​ ఇందుకు సంబంధించిన యూట్యూబ్​ వీడియోలతోనే నెలకు రూ.అక్షరాలా రూ.10 లక్షలు సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే,

మొదట్లో రాజేశ్​ రవానీ కూడా అందరి లాంటివాడే. లారీని నడుపుతూ గతుకుల రోడ్లపై ముక్కుతూ మూల్గుతూ ప్రయాణించడం, హైవేలపై దూసుకెళ్లడం, సరకు రవాణా చేయడం, దించడం, ఎత్తడం వంటి పనులు చేస్తుండే వాడు. అదృష్టం అనేది ఎలా దరికి వస్తుందో చెప్పలేం. ఈ రాజేశ్​ రవానీకి మాత్రం రోడ్డు పక్కన బండి ఆగిపోయి తరించింది అదృష్టం. అప్పుడే అక్కడ బండి నిలిపి వేసి, స్టౌ ఆన్​ చేసి చికెన్​ కూరను వండాడు. కష్టాల్లోనూ కమ్మని భోజనం ఆరగిస్తున్నానంటూ ఆ సంగతులను చెప్పి, వాటిని ఫోన్​లో రికార్డు చేశాడు.

ఈ మాటలు విన్న రాజేశ్​ కుమారుడు నాన్న మాటలో ఏదో మ్యాజిక్​ ఉందని పసిగట్టాడు. ఆ వీడియోను వెంటనే యూట్యూబ్​లో అప్​లోడ్​ చేశాడు. వీడియోను చూసిన జనం తెగ ఫిదా అయిపోయారు. దాంతో లారీ క్యాబిన్​నే కిచెన్​గా మార్చేసి, నోరూరించే వంటలు చేస్తూ మాటల మసాలాను దట్టించేవాడు. ఇలా చేపల పులుసు, రాఖీ పండగ పాయసం, గరమ్​ గరమ్​ పకోడా వంటి వంటలను వండేవాడు. వాటిని వీడియోలు తీసి, ఘుమఘుమలాడించే వాడు. వంట వండటమే కాకుండా, ట్రక్​ వెళ్లిన చోట వింతలు, విశేషాలు, రోడ్డు ప్రక్కన ప్రమాదాలు వంటివి చూపించడం చేశాడు. అలాగే అభిమానులతో మీటప్​లు కూడా చేసేవాడు.

ఒక్కో వీడియోకు కనీసం లక్షన్నర వ్యూస్​ : రాజేశ్​ వాడే మాటలు నాటుగా ఉన్నా ఏక్ ​దమ్​ కడక్​ చాయ్​లా నోరూరించేవి అతని వీడియోలు. ఒక్క వీడియో రిలీజ్​ చేయగానే లక్షల్లో అభిమానులు చూసేవారు. ఇలా లక్షలాది మంది అభిమానులను తయారు చేసుకున్నారు. వీరిలో క్లాస్​ పీపుల్స్​ ఉన్నారు, మాస్​ మహారాజాలు ఉన్నారు. రాజేశ్​ పెట్టిన వీడియోలు అన్నీ ఆర్​ రాజేశ్​ వ్లాగ్స్​ పేరుతో పాపులర్​ అయ్యాయి. ఆయన పెట్టిన ఒక్కో వీడియోకు కనీసం లక్షన్నర వ్యూస్​ వస్తుంటాయి. ఇలా ఇప్పటి వరకు 19 లక్షల మంది సబ్​ స్కైబర్స్​ను సొంతం చేసుకున్నారు. ఈ వీడియోలు ద్వారా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలైనా సంపాదిస్తాడు. ఈ విషయాలు అన్నీ రాజేశ్​ ఓ పాడ్​ కాస్ట్​ షోలో తెలిపాడు. ఇంకో విషయం ఏంటంటే, రాజేశ్​ ఇలా వీడియోలతో పోగేసిన సొమ్ముతో ఈ మధ్యే ఇంధ్రభవనం లాంటి ఓ ఇంటిని నిర్మించుకున్నాడు.

కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారా? ఈ 6 టిప్స్​ పాటిస్తే సూపర్ సక్సెస్ గ్యారెంటీ! - How To Grow Your YouTube Channel

లోకల్​ గర్ల్​​ సుభిక్ష- సముద్రం లోపల యూట్యూబ్ Vlogs- పీతల పచ్చళ్లతో ఫుల్ ఫ్రావిట్స్​! - tamil female sea vlogger

Last Updated : Aug 24, 2024, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.