Live Painter Dhanushya from Vijayawada : చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరిచిన ఈ యువతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. కానీ మనసు ఎప్పుడు చిత్రాల పైనే నిమగ్నమై ఉండేది. తాతయ్య, తండ్రి చిత్రాలు గీయడంలో నిష్ణాతులు కావడంతో వారిని చూసుకుంటూ పెరిగిన ఈ యువతి తను కూడా పెయింటింగ్‌లో మంచి గుర్తింపు సాధించాలని కలలు కనేది.
విజయవాడకు చెందిన పళ్లెం ధనుష్య నగరంలోని వీఆర్ సిద్ధార్థ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం అంటే అమితమైన ఆసక్తి పెంచుకుంది ఈ యువతి. తండ్రి నాగ వెంకటేశ్వరరావు ప్రైవేటు కాంట్రాక్టర్, తల్లి శేషకుమారి. వీరిద్దరికి కూడా చిత్రాలు అంటే ఇష్టం కావడంతో కూతురుని ప్రోత్సహించారు. వీరితో పాటు టీచర్లు కూడా ధనుష్యకు అండగా నిలవడంతో ఎనిమిదో తరగతి నుంచే పెయింటింగ్‌పై శ్రద్ధ పెట్టింది ఈ యువతి.
తల్లిదండ్రులే స్ఫూర్తి- కళా రంగాల్లో రాణిస్తున్న యువతి - Meda Sindhu Shri From Vijayawada
ఖాళీ సమయం దొరికితే చాలు కాగితాలు, కార్డుబోర్డుల పైన చిత్రాలు గీస్తూ ఉండేది ధనుష్య. అలా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన కల సాకారం చేసుకునే విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. ఇదే సమయంలో అమెరికన్ చానల్‌లో లైవ్ పెయిటింగ్ గురించి తెలుసుకుంది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ పెయింటింగ్‌పై దక్షిణ భారతదేశంలోనూ అవగాహన కల్పించడమే లక్ష్యమని చెప్తోంది ఈ యువతి.
దనుష్యకు వారసత్వంగా వచ్చిన కళ బొమ్మలు గీయడం కావడంతో తక్కువ కాలంలోనే లైవ్ పెయిటింగ్‌లో పట్టు సాధించింది. ఆన్‌లైన్‌లో చూసి చిత్రాల గీయడంపై మరింత అవగాహన పెంచుకుంది. మొదట సెలబ్రేటీల చిత్రాలు గీసి వాటిని సామాజిక మాద్యమాలలో పోస్టు చేసింది. తాను గీసిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో మంచి అవకాశాలు పొందగలిగింది ఈ యువతి.
'ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత 3 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా లైవ్ పెయింటింగ్ పైనే దృష్టి సారించాను. ఈ పెయింటింగ్‌పై తెలుగు రాష్ట్రాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో మొదట్లో అవకాశాలు రావడం కష్టమైంది. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా సామాజిక మాద్యమాల ద్వారా నా ప్రతిభను నిరూపించుకున్నాను. మంచి భవిష్యత్తు కలిగిన ఈ రంగంలో రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రంగంలోకి రావాలనుకునే వారు ముఖ్యంగా సమయాబావంతో మెలగాలి.' -ధనుష్య, లైవ్ పెయింటర్
'కూతురు ఉద్యోగం వదిలేసినప్పుడు తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందాము. కానీ ఇప్పుడు తమ అంచనాలకి మించి రాణిస్తోంది. దేశంలో ఉత్తమ కళాకారుల్లో ఒకరిగా నిలవాలనే తన పట్టుదల చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది.'-నాగ వెంకటేశ్వరరావు,శేషకుమారి (ధనుష్య తల్లిదండ్రులు
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
ఫొటోలు, వీడియోలు ఎన్ని ఉన్నా చేత్తో గీసే చిత్రాలు ఇచ్చే ఆనందమే వేరు. వాటికి ప్రత్యేకతను జోడించి లైవ్ పెయింటింగ్ ద్వారా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ధనుష్య. విదేశాల్లో ఖ్యాతి గాంచిన ఈ ప్రక్రియను తెలుగునాట పరిచయం చేయడంతోపాటు తమిళనాడు, కర్నాటకల్లోనూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.