ETV Bharat / state

ఏపీలో మద్యం దుకాణాలకు 90వేల దరఖాస్తులు! - అత్యధికంగా ఆ జిల్లా నుంచే

ప్రభుత్వానికి రూ.1,792 కోట్ల ఆదాయం-గడువు ముగిసే సమయానికి క్యూలైన్లలో వ్యాపారులు

Liquor Shops Applications Deadline Over in AP
Liquor Shops Applications Deadline Over in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 7:39 AM IST

Liquor Shops Applications Deadline Over in AP : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చి ఉంటాయని, రూ.1800 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి.

మొత్తం దరఖాస్తులు 90 వేలపైనే : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల సమర‌్పణకు శుక్రవారంతో గడువు ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఏడింటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, ఆ సమయానికి 87,986 దరఖాస్తుల అందగా రాత్రి 11 గంటలకు ఆ సంఖ్య 89,643కు పెరిగింది. గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.1800 కోట్లపైనే ఖజానాకు ఆదాయం సమకూరనుంది.

మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు - రూ. 1800 కోట్లకు పైగా ఆదాయం

ఏపీలో నూతన మద్యం పాలసీ : రాష్ట్రంలో 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పట్లో 4,380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 76 వేల దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో దుకాణానికి 17 నుంచి 18 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్‌ రుసుముల రూపంలో అప్పట్లో ఎక్సైజ్‌ శాఖకు 474 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి 3,396 దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంటే 2017 కన్నా తక్కువ దుకాణాలకే నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తులు మాత్రం ఎక్కువ వచ్చాయి. ఆఖరి రోజునే 24,014 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

వత్సవాయి దుకాణానికి అత్యధికంగా దరఖాస్తులు : రాష్ట్రంలో సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్​ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు అందాయి. ఎన్టీఆర్​, ఏలూరు, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో మద్యం దుకాణాలకు ఎక్కువ పోటీ నెలకొంది. ఎన్టీఆర్​ జిల్లాలో 113 దుకాణాలకు నోటికేషన్ ఇవ్వగా రాష్ట్రంలోనే అత్యధికంగా 5,787 దరఖాస్తులు వచ్చాయి. వత్సవాయి మండలంలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు పడ్డాయి. ఈ మూడూ ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని దుకాణాలే. సగటున ఒక్కో దుకాణానికి ఏలూరు జిల్లాలో 37, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో 34, కర్నూలు, కోనసీమ, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 30 దరఖాస్తులు వచ్చాయి.

అలర్ట్​ - ముగియనున్న మద్యం షాపుల దరఖాస్తుల గడువు - 1300 కోట్లు దాటిన ఆదాయం

అక్టోబరు 16 నుంచి అమలు : శ్రీ సత్యసాయి, తిరుపతి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ముఖ్య నేతలు తమ వారిని తప్ప ఇతరులెవరినీ దరఖాస్తు వేయనివ్వకుండా అడ్డుకోవటం, కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అక్టోబర్ 14న జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో దరఖాస్తులు లాటరీ తీయనున్నారు. లాటరీ దక్కినవారికి అక్టోబరు 15న దుకాణాలు కేటాయిస్తారు. అక్టోబరు 16 నుంచి ఏపీ నూతన మద్యం విధానం అమలులోకి రానుంది.

అక్కడ లిక్కర్ లెక్కే వేరు - నూతన మద్యం షాపులకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.