ETV Bharat / state

ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry

Leopard Wandering in Rajahmundry People Fear : తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో చిరుతపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఆపద ఎలా ముంచుకొస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం శ్రీరాంపురంలో చిరుత పాదముద్రలు కనిపించాయనే వందతులతో స్థానికులు హడలిపోయారు. చివరకు అవి పులివి కాదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

leopard_wandering_in_rajahmundry_people_fear
leopard_wandering_in_rajahmundry_people_fear (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 10:44 AM IST

Leopard Wandering in Rajahmundry People Fear : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారులోని దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. మంగళవారం, శ్రీరాంపురం సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయని..స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 4పాదముద్రలు పక్క పక్కనే ఉన్నాయని, రెండు చిరుతలు తిరుగుతున్నాయంటూ ఆందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు వాటిని పరిశీలించారు. చివరకు ఆ పాదముద్రలు చిరుతవి కాదని ఓ జాతి జాగిలానికి చెందినవని తేల్చక స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

చిరుత భయంతో అటు దివాన్ చెరువు పరిసరాల్లోని రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ సీతాఫలాల సీజన్ నడుస్తోంది. శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, కవలగొయ్యి, పిడింగొయ్యి గ్రామాలకు చెందిన రైతులు అటవీ ప్రాంతంలోని సీతాఫలాల తోటలను గంపగుత్తగా కొనుక్కొని మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటారు. కానీ, ఈ ఏడాది వారు తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏటా తెల్లవారుజామున 5 గంటలకే సీతాఫలాలు కోసి మార్కెట్‌కు తరలించే వారు. కానీ అటవీ , పోలీసు అధికారులు తెల్లవారుజామున ఒంటరిగా తోటల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఫలితంగా రైతులు సతమతం అవుతున్నారు.

మరోసారి ట్రాప్‌ కెమెరాకు చిక్కిన చిరుత- భయాందోళనల్లో ప్రజలు

'అడవిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తోటల్లో సీతాఫలాలు తయారైపోయాయి, వాటిని ఇప్పుడు కొయ్యకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడంటే అప్పుడు వెళ్లి పళ్లు కోసుకొచ్చేవాళ్లం. అటవీ శాఖ వాళ్లు మమ్మల్ని తోటలకు వెళ్లొద్దంటున్నారు. పులి భయానికి మేమంతా భయంభయంగా ఉంటున్నాం.' - స్థానికులు

"ఆపరేషన్ చిరుత"- రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో అటవీశాఖ అలర్ట్ - LEOPARD SPOTTED IN RAJAHMUNDRY

సీతాఫలాలు జీడిమామిడిలా నిల్వ ఉండవు. పక్వానికి వచ్చిన వెంటనే కోసి మార్కెట్‌కు తరలించాలి. లేదంటే నేలపాలవుతాయి. చిరుత భయం వెంటాడుతున్నా కొందరు రైతులు విధిలేని పరిస్థితుల్లో అడవిలోకి వెళ్తున్నారు. కోతులు, పిట్టలు సీతాఫల తోటలపై దాడి చేసి ఫలాలను కొరికి తినేస్తుంటాయి. వాటి బారి నుంచి తోటలను రక్షించుకోవాలంటే పగలంతా కూలీలను తోటల్లో కాపలా ఉంచాలి. చిరుత భయంతో ఎవరూ కాపలాకు రావడంలేదు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు కోరుతున్నారు. చిరుత జాడ తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు, పోలీసులు అటవీ సమీప ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరూ బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.