Leopard Wandering At Mahanandi Temple in Nandyala : ఏపీలోని నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తుండంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆలయ సమీపంలోని గోశాల వద్దకు రెండు సార్లు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచరించడంతో పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన నాగన్న అనే యువకుడిపై చిరుత దాడి చేయడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిక ఏర్పాటు చేశారు.
గత కొన్ని రోజులుగా చిరుత సంచారం మహానంది పరిసరాల్లో ఏదో ఒక ప్రదేశంలో కొనసాగుతుంది. మహానందిలోని టీటీడీ సత్రాల సమీపంలో గురువారం ఉదయం చిరుత కుక్కను నోటితో పట్టుకొని వెళ్లిందని, సాయంత్రం మహానందీశ్వరనగర్, ఎంప్లాయిస్ కాలనీలో కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరాదని చిరుత సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుతను బందించేందకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో ప్రజలు వెదురు కర్రల సేకరణకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఇప్పటికే కలెక్టర్ సైతం విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత పులి జనవాసల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
బాబోయ్ పులులు - భయాందోళనతో ప్రజలకు నిద్ర కరవు - LEOPARDS MIGRATION IN NANDYALA
చిరుతను తప్పించబోయి కారు బోల్తా - మహిళ మృతి - Road Accident In Nizamabad