Leopard Roaming Near Bhimadolu Area in Eluru District : ఏలూరు జిల్లా భీమడోలు పరిసరాల్లో సంచరిస్తున్న జంతువు చిరుతపులి అని నిర్ధారణ అయ్యింది. భీమడోలు శివారు ద్వారకా తిరుమల మండల పరిధిలోకి వచ్చే అందనాలమ్మ చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత స్పష్టంగా కనిపించినట్లు అటవీ శాఖాధికారులు తేల్చి చెప్పారు. దీంతో అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు. భీమడోలు మండలం అంబరుపేట, పోలసానిపల్లి, ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, అందనాలమ్మ చెరువు, కాట్రగడ్డ కల్యాణ మండపం పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. ఎవరు ఒంటరిగా బయట తిరగవద్దని హెచ్చరిస్తూ సోమవారం టాంటాం వేయించారు. అధికారులు చిరుతను బంధించేందుకు డీఎఫ్‌వో ఆశాకిరణ్ నేతృత్వంలో బోన్లు ఏర్పాటు చేశారు.
దాగుడుమూతల చిరుత - ఎక్కడుందో ! ఏమైందో? - Leopard Active at Diwancheruvu
తిరుమలలో మళ్లీ చిరుత - భయంతో తాళాలు వేసుకున్న సిబ్బంది - వీడియో వైరల్ - Leopard Found in Tirupati