ETV Bharat / state

గౌతమి మధ్యలంక ప్రాంతాల్లో చిరుత అలజడి! - డ్రోన్లతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ - Leopard movement in East Godavari - LEOPARD MOVEMENT IN EAST GODAVARI

Tiger Roaming in East Godavari District : ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి డ్రోన్ల సాయంతో వెతుకుతున్నారు.

tiger_roaming_in_east_godavari_district
tiger_roaming_in_east_godavari_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 3:36 PM IST

Tiger Roaming in East Godavari District : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొద్ది రోజులుగా చిరుత పులి సంచారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. చిరుత పులి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రావులపాలెం-కొమరాజులంక సమీపంలో గౌతమి గోదావరిలోని మధ్యలంక ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందన్న వార్త ఆదివారం సాయంత్రం చక్కర్లు కొట్టింది. నారాయణలంకకు చెందిన వెంకన్న, ఊబలంకకు చెందిన గంగరాజు పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

చిక్కదు, దొరకదు - రూటు మార్చి చుక్కలు చూపిస్తున్న చిరుత - Leopard Active in Kadiyam Nurseries

Leopard Wandering : గోదావరిలో వేటకు వెళ్లిన సమయంలో తనకు కనిపించిందని ఒకరు చెప్పగా, తెల్లవారుజామున పడవపై వెళ్తుండగా గోదావరి దుబ్బులు మధ్యలో సడి జరిగిందని మరొకరు చెప్పారు. దీంతో డీఎఫ్‌ఓ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో గౌతమి వంతెన సమీపంలో పరిశీలించారు. 4 బృందాలతో కలిసి ఆ ప్రాంతంలో చిరుత కోసం అన్వేషిస్తున్నారు. వంతెన వద్ద ఉన్న మధ్యలంక ప్రాంతంలో పులి జాడల్ని డ్రోన్‌ కెమెరా సాయంతో వెతుకుతున్నారు. పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులతో తిరిగి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

'రావులపాలెంలో చిరుత కనిపించిందని చెప్పడంతో వచ్చి పరిశీలించాం. చిరుత కదలికలకు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదు. సోమవారం బోటు సాయంతో గోదావరి మధ్యలంక ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తాం.' -ప్రసాదరావు, డీఎఫ్‌ఓ

People in Fear of Cheetah Roaming : కడియంలో చిరుత సంచారంపై గత రెండు రోజులుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని డీఎఫ్‌వో ప్రసాదరావు తెలిపిన విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా పాదముద్రలు నమోదు కావడం లేదన్నారు. కడియపులంక నర్సరీల నుంచి గోదావరి లంకల వైపు చిరుత వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు.

నాలుగు బోన్లు, నలభై ట్రాప్‌ కెమెరాలు, నాలుగు సోలార్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసేందుకు బృందం సిద్ధంగా ఉందని గతంలోనే తెలిపారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆ తరహాలో రోజురోజుకూ పనులు వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.