ETV Bharat / state

లెక్చరర్​ అసభ్య ప్రవర్తన: దేహశుద్ధి చేసిన విద్యార్థులు - Lectuler Harrasement on Student

Lectuler Harrasement on College Students: విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్​కు తోటి విద్యార్థులందరూ కలిసి దేహశుద్ధి చేశారు. లెక్చరర్ వేధింపులపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవటంతో సహనం కోల్పోయిన విద్యార్థులు ప్రిన్సిపాల్​పై దాడికి దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసి ఆ లెక్చరర్​కు తగిన గుణపాఠం చెప్పారు.

Lectuler_Harrasement_on_College_Students

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 6:48 PM IST

లెక్చలర్​ అసభ్య ప్రవర్తన: దేహశుద్ధి చేసిన విద్యార్థులు

Lectuler Harrasement on College Students: తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తారు. కానీ కొంతమంది వల్ల గురువు స్థానానికి మాయని మచ్చ వస్తోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించటంతో విద్యార్థులందరూ కలిసి దాడి చేసి అతనికి బుద్ది చెప్పారు. పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్​కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ

Students Attack on Lectuler in Rajampeta Narayanadri College: విద్యార్థులు తెలిపిన వివరాలు ప్రకారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ (Narayanadri Engineering College Lectuler Harrasement) జయప్రకాష్ నారాయణ గత కొంతకాలంగా విద్యార్థులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంయమనం పాటించారు. కానీ రోజు రోజుకు అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ రోజు కళాశాల లెక్చరర్ మరింత బరితెగించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం (Bad Behaviour)తో విద్యార్థులు సహనం కోల్పోయారు. కాలేజీలోని తోటి విద్యార్థులతో కలిసి అతనిపై దాడికి దిగారు.

విద్యార్థినిపై స్కూల్ టీచర్ లైంగిక వేధింపులు - టాయిలెట్​లోకి వెళ్లి మరీ అసభ్య ప్రవర్తన

ఈ ఘటనపై సుమారు 100 మంది విద్యార్థులు కలిసి మన్నూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు (complaint) చేశారు. పోలీసులు ఆ లెక్చరర్​ను పిలిపించి విచారించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎంతవరకు కేసు నమోదు చేయకపోవటంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసన (Protest) చేపట్టారు. అక్కడికి చేరుకున్న మన్నూరు ఎస్సై రవీంద్రనాథ్ విద్యార్థులతో చర్చించి జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. లెక్చరర్​పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.

" గత కొంతకాలంగా లెక్చరర్ మా తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులపై డబుల్ మీనింగ్ పదాలు ఉపయోగిస్తున్నారు. మనసు క్షోభించేలా మాట్లాడుతున్నా స్థిమితపరచుకొని ఇంతకాలం ఊరుకున్నాము. అయితే ఈ రోజు అతని ప్రవర్తన తారాస్థాయికి చేరడంతో తోటి విద్యార్థులతో కలిసి దేహశుద్ధి చేసే పోలీస్ స్టేషన్​లో అప్పగించాము. లెక్చరర్ అరాచకాలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది".

-నారాయణాద్రి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని

మహిళా కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల ఫిర్యాదుపై ఆర్జేడీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.