ETV Bharat / state

పేదింట్లో పుట్టిన విద్యాకుసుమం - నీట్‌ పీజీలో సత్తా చాటిన లావణ్య - Lavanya From Anantapur neet ranker

Lavanya From Anantapur Secured 65th Rank in NEET PG : తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఎదగాలని లక్ష్యం పెట్టుకుందా యువతి. కన్నవారు చేసే పాడి పనుల్లో సాయం చేస్తూనే చదువుల్లో రాణిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివి ఉత్తమ మార్కులు సాధించింది. తన ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చింది ఆర్​డీటీ సంస్థ. ఆ అవకాశాన్ని అందుకుని ఏకంగా నీట్‌ పీజీ పరీక్షల్లో 65వ ర్యాంకు సాధించింది శ్రీ సత్యసాయి జిల్లాకి చెందిన లావణ్య.

lavanya_from_anantapur_secured_65th-_rank_in_neet_pg
lavanya_from_anantapur_secured_65th-_rank_in_neet_pg (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 2:00 PM IST

Lavanya From Anantapur Secured 65th Rank in NEET PG : చదువుకోవాలంటే సౌకర్యాలు ఉండాలి. ప్రైవేటు విద్యాసంస్థలో చదివితేనే జీవితాలు మారుతాయనే భ్రమలో కాలం వెళ్లదీస్తుంటారు చాలా మంది. కానీ, ఈ యువతి అలా కాదు. మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్‌ అదే వస్తుందని బలంగా నమ్మింది. సాధన చేసి ప్రతిభ చూపింది. ఫలితంగా ఉచిత చదువుతోపాటు జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు కైవసం చేసుకుందీ విద్యాకుసుమం.

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన శంకరనారాయణ, మాలతి దంపతుల రెండో కుమార్తె లావణ్య. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లే కావడంతో తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతూ పెంచి పోషించారు. వీరికి ఉన్న మూడు ఆవుల ద్వారా వచ్చే పాడి ఆదాయంతోనే కుటుంబం నెట్టుకు వస్తోంది. చిన్నప్పటి నుంచి ఈ కష్టం చూసిన లావణ్య చదువుల్లో రాణించాలని పట్టుదలతో ప్రయత్నాలు మెుదలు పెట్టింది.

పదో తరగతి ఫలితాల్లో 9.5 శాతం మార్కులు సాధించింది లావణ్య. చదువులో ప్రతిభ కనబరిచిన తనకు ఇంటర్ చదివించడానికి అనంతపురానికి చెందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు ముందుకు వచ్చింది. ఆర్థిక సహాయం చేసి విజయవాడలోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ కోర్సులో చేర్పించారు. తన ఎదుగుదలకు తలిదండ్రుల కష్టంతోపాటు ఆర్డీటీ సహాయం తోడైందని లావణ్య చెబుతోంది.

సాధించాలనే పట్టుదల అందుకు తగ్గ ప్రోత్సాహం తోడవ్వడంతో ఇంటర్‌లో 981 మార్కులు సాధించింది లావణ్య. సాధారణంగా RDT సంస్థ ఎవరికైనా ఇంటర్ విద్య వరకే సహాయం చేస్తుంది. అయితే లావణ్య ప్రతిభ, కుటుంబం పరిస్థితి చూసి నిబంధనలు మార్చుకోవడం ద్వారా తన చదువుకు అండగా నిలిచింది ఆ సంస్థ. ఫలితంగా నీట్ పోటీ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించింది. నీట్‌ ర్యాంకుతో కడప రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎలస్​ చదివింది ఈ విద్యాకుసుమం.

'ఎంబీబీఎస్​ చేశాక మెడిసిన్‌లో పీజీ చేయాలని ప్రయత్నాలు చేశాను. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని తల్లిదండ్రులు వద్దన్నారు. విషయం తెలుసుకున్న మా చిన్నాన్న గోపాల్​ ఫీజు చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఆయన సాయంతో 2023లో మెడిసిన్ పీజీ కోచింగ్‌లో చేరి ఈ ఏడాది పీజీ నీట్ పోటీ పరీక్ష రాశాను. జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది.' - డా.లావణ్య, వైద్యురాలు

'తమ జీవితాలు మార్చాలని మా కుమార్తె కుమారుడిలా కష్టపడుతోంది. మాకెంతో గర్వంగా ఉంది. లావణ్యకు వివాహం చేయాలని బంధువులు ఎంత ఒత్తిడి చేసినా మేము ముందుగా ఆమె చదువుకే ప్రాధాన్యత ఇచ్చాము. ఆర్డీటీ సహాయం వల్లే మా కుమార్తె కష్టపడి డాక్టర్ అయ్యింది.' - లావణ్య తల్లిదండ్రులు

రోడ్డుపైనే సాధన - విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట - Extensive Skills in Roller Skating

కన్నవాళ్లకు భారం కాకూడదని చదివి బాధ్యతగా ఎదుగుతోంది లావణ్య. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. తాను సాధించిన మెడిసిన్ పీజీ ర్యాంకుతో రేడియాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ కోర్సుల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందని డా. లావణ్య అంటోంది. దీని ద్వారా పేదలకు సేవ చేస్తానని అంటోంది.

పేరుకు తగ్గట్లుగానే 'చరిష్మా' - ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​​ లక్ష్యమంటున్న విజయవాడ యువతి - Vijayawada Surya Charisma

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.