ETV Bharat / state

పేదల భూములను సీనియర్ ఐఏఎస్​లు ఇలా చేజిక్కించుకున్నారు! - Land grabs in Bhogapuram - LAND GRABS IN BHOGAPURAM

Land grabs in Bhogapuram: విజయనగరం జిల్లాలో అసైన్డ్ , డి- పట్టా భూములపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులు, తీసుకురానున్న చట్టాల గురించి ముందుగానే తెలుసుకున్న వీరు, పేదలు నమ్ముకున్న భూములను కొట్టేసే పన్నాగం పన్నారు. అతి తక్కువ ధరకు వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు. భూములు కొట్టేసిన వాళ్లలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండటం విశేషం.

Land grabs in Bhogapuram
Land grabs in Bhogapuram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 12:25 PM IST

Land grabs in Bhogapuram: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ పార్టీ అగ్ర నాయకులు, వారి అడుగులకు మడుగులొత్తే సీనియర్‌ అధికారులు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని భూములపై కన్నేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం రానుండటంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. పైగా అమాయక ప్రజలు, ప్రశాంత వాతావరణం ఉండటంతో భూచోళ్ల కళ్లు ఈ భూములపై పడ్డాయి.

విమానాశ్రయ చుట్టుపక్కల భూములను చేజిక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. మండలంలోనే అసైన్డ్‌ భూముల వివరాలు సేకరించి అనుభవదారులను మభ్యపెట్టి కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డి-పట్టా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, తర్వాత రూపాయి కూడా రాదంటూ లబ్ధిదారులను బెదిరించి తక్కువ ధరకే కొట్టేస్తున్నారు. కంచేరు, కంచేరుపాలెం, రెడ్డి కంచేరు, ముంజేరు, రామచంద్రపేట, బసవపాలెం గ్రామాల్లో పేదల డి-పట్టా భూములను స్వాధీనం చేసుకున్నారు.

చావనైనా చస్తాం కానీ, భూములు వదులుకోం: విశాఖ భూ బాధితులు - LAND GRAB IN VISAKHA

ప్రధానంగా ప్రభుత్వ భూములు, డి-పట్టా భూములున్న కోస్టల్‌ కారిడార్‌పై భూబకాసురులు గురి పెట్టారు. రెండేళ్ల క్రితం సీనియర్‌ IAS అధికారిణి రహస్యంగా ఈ ప్రాంతంలో పర్యటించి భూములను పరిశీలించారు. ఆ తర్వాత మరికొందరు సీనియర్ IAS అధికారులు ఎప్పటికప్పుడు రహస్య పర్యటనలు జరుపుతున్నారు. భోగాపురం మండలానికి సరిహద్దులోని విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద 318 ఎకరాల ప్రభుత్వ, డి-పట్టా భూములు ఉన్నట్లు గుర్తించారు. ఓ ప్రముఖ హోటల్ నిర్మాణానికి అనువుగా 40 ఎకరాలు సేకరించేందుకు రైతులను కలిసి భూములు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు.

రాష్ట్రంలో ఉన్నత అధికారులతో మంచి సంబంధాలు ఉన్న త్రిలోక్ అనే వ్యక్తి దీనిలో మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. కంచేరు రెవెన్యూలోని ప్రభుత్వ భూములు కలిగి ఉన్న రైతులను కలిసి మంతనాలు సాగిస్తున్నారు. భూ వ్యవహారాల గురించి ఈ ప్రాంతంలోని ఓ రిసార్ట్‌లో ఆయన 14 నెలలు బస చేసినట్లు సమాచారం. విశాఖలోని బీచ్‌రోడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ రహదారి చుట్టుపక్కల భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగింది.

ఇప్పుడు అంతకు మించి భోగాపురం, పూసపాటిరేగ తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సంకేతాలు ఉన్నాయి. దీంతో నాయకులు, అధికారుల కళ్లు ఆ ప్రాంతంపై పడ్డాయి. దిబ్బలపాలెంతో పాటు, తూడెం, బసవపాలెం ప్రాంతాలపై వారు గద్దల్లా వాలారు. బసవపాలెంలో సుమారు 45 ఎకరాల భూమిని సాగు చేస్తున్న 65 మంది రైతులు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున చెల్లించేందుకు ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్లు తెలిసింది. రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు.

భీమిలీ బీచ్​ వద్ద యథేచ్ఛగా వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు - స్పందించని అధికారులు - YSRCP Leaders Illegal constructions

అనంతరం పూసపాటిరేగ మండలం కోనాడ, కందివలస, చింతపల్లి, చోడమ్మ అగ్రహారం, కనిమెట్ట ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. కనిమెట్ట రెవెన్యూలో జాతీయ రహదారిని ఆనుకుని పేదల సాగులో 200 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఎకరా ఇక్కడ కోటి రూపాయల వరకూ పలుకుతోంది. స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో రైతులకు ఎకరాకు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు చెల్లించి ఒప్పందాలు చేసుకున్నారు.

కందివలస గ్రామంలో సుమారు 56 మంది రైతులకు చెందిన 80 ఎకరాల భూములను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా జి.చోడవరంలో 60 ఎకరాలు, కొప్పెర్లలో 30 ఎకరాలు, ఎరుకొండలో 30 ఎకరాలు, కొవ్వాడ, కోనాడ తదితర ప్రాంతాల్లో ఈ భూదోపిడీ భారీగా జరిగినట్లు సమాచారం. డి-పట్టా భూముల లావాదేవీలపై జిల్లా, మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఎవరూ నోరు మెదపడంలేదు. డి-పట్టా భూముల్లో ఎన్ని ఎకరాలు ఫ్రీ హోల్డ్‌ చేశారని ప్రశ్నిస్తే మౌనం వహిస్తున్నారు.

మంచి ముసుగులో దోపిడీ - ఎసైన్డ్‌ భూముల కోసం బరితెగించిన వైఎస్సార్సీపీ ముఠాలు - YSRCP Govt Eye on Assigned Lands

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.