ETV Bharat / state

ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital - UDDANAM KIDNEY HOSPITAL

Lack of Facilities in Uddanam Kidney Hospital in Srikakulam District : ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. కానీ అందులో వసతులు కల్పించడం మాత్రం మరిచిపోయారు. పూర్తి స్థాయిలో వైద్యపరికరాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

UDDANAM KIDNEY HOSPITAL
UDDANAM KIDNEY HOSPITAL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 2:30 PM IST

ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి (ETV Bharat)

Lack of Facilities in Uddanam Kidney Hospital in Srikakulam District : మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఈ పద్యం ఆ ఆస్పత్రికి సరిగ్గా సరిపోతుంది. బయట నుంచి చూడ్డానికి హంగూ ఆర్భాటాలతో ఉన్నా లోపల మాత్రం డొల్లే. ఉద్దానం బాధితులను ఆదుకుంటామంటూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడి చేసింది. ఆగమేఘాలపై కిడ్నీ పరిశోధన ఆస్పత్రిని ప్రారంభించి చేతులు దులుపుకుంది. బిల్డింగులు ఘనంగా ఉన్నా అందులో సరిపడా వైద్య పరికరాలు లేవు. డాక్టర్లు లేరు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Uddanam Kidney Hospital Problems : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో తరతరాలుగా స్థానికులు కిడ్నీ వ్యాధులతో కుంగిపోతున్నారు. ఇచ్ఛాపురం, పలాస, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, మందస, మండలాల్లో ఏటా వేలల్లో కిడ్నీ కేసులు నమోదవుతున్నాయి. నీటి కలుషితంతో ఇప్పటికీ చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా కిడ్నీ బాధితుల తలరాతలు మాత్రం మారడం లేదు.

కిడ్నీ భూతాన్ని తరిమికొట్టాలనే లక్ష్యంతో 2018 నవంబర్‌లో అప్పటి సీఎం చంద్రబాబు కిడ్నీ పరిశోధన ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేశారు. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు పట్టాలెక్కలేదు. ఉద్దానం బాధితులను ఉద్ధరిస్తానంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. పలాసలో హాస్పిటల్ భవనం అయితే నిర్మించారు కానీ వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు ఇంకా మొదలే కాలేదు.

శిథిలావస్థలో పాఠశాల భవనాలు - కొత్తవి నిర్మించాలని విద్యార్థుల మొర - Dilapidated School Buildings

ఆస్పత్రిలో వసతుల లేమి : కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కిడ్నీ ఆస్పత్రిలో మెరుగైన సదుపాయాల్లేక పేద రోగులకు అక్కరకు రావడం లేదు. గతంలో కొన్న డయాలసిస్ పరికరాలనే ఇప్పటికీ వాడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో డయాలసిస్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. వైద్య పరికరాల్లేక రోగులు పరీక్షలు చేయించుకోవాలంటే బయటకు వెళ్లాల్సిన దుస్థితి. ఫలితంగా పేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు.

సమస్యలకు నిలయాలుగా కొండ ప్రాంతాలు- కొత్త ప్రభుత్వానికి విన్నపాలు - Vijayawada hill dwellers problems

మూలన పడ్డ యంత్రాలు : కిడ్నీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి నెఫ్రాలజిస్ట్‌లు లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. 41 మంది వైద్యులు అవసరం ఉండగా కేవలం 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. కొద్ది కాలంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభిస్తామని జగన్ హామీ ఇచ్చినా ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. కొన్ని యంత్రాలున్నా స్పెషలిస్టులు లేక మూలన పడి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఉద్దానం ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని కిడ్నీవ్యాధిగ్రస్తులు కోరుతున్నారు. కిడ్నీ పరిశోధన ఆస్పత్రిలో సదుపాయాలు కల్పించి మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.

విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రికి సుస్తీ - Maharaja Sarvajana Hospital

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.