KTR Open Challenges CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ బరిలో నిల్చొందాం అని అన్నారు. అక్కడ పోటీ చేసి తేల్చుకుందాం అని ఛాలెంజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో సవాల్ చేసి పారి పోయారని, అలాంటి ఆయన మాటకు విలువేముందని ఎద్దేవా చేశారు.
'జగన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు- జెండా సభ విజయంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు'
KTR Comments : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేసిన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానాన్ని అయినా గెలిచి చూపించాలని బీఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి అని వ్యాఖ్యానించారు. తను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. ఇద్దరం కలిసి మల్కాజిగిరి ఎంపీకి పోటీ చేసి తేల్చుకుందాం అని ఘాటు విమర్శలు చేశారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ల లెక్క తేలింది - ఏడాదికి గరిష్ఠంగా ఎన్ని వాడుకోవచ్చో తెలుసా?
గతంలోనూ కొడంగల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేసి పారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువేముందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం 420 కి పైగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని హితవు పలికారు.
బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!
" నాది మేనేజ్మెంట్ కోటా ఐతే రాహుల్, ప్రియంకా గాంధీది ఏం కోటా? రేవంత్‌ది పేమేంట్ కోటానా? డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారు. పేమెంట్ కోటా కాబట్టే రేవంత్ రెడ్డి దిల్లీకి పేమెంట్ చేయాలి. రాష్ట్రంలోని బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి దిల్లీకి రేవంత్ రెడ్డి కప్పం కట్టాలి. త్వరలో రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ బిల్డర్లు, వ్యాపారులు రోడ్డుక్కుతారు. మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అధికారంలో జరిగే తప్పులు అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు కాదా. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి. మార్చి 2 నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలపై కసరత్తు జరుగుతుంది. ఎంపీ అభ్యర్థిత్వాలపై కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తారు " - కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు