ETV Bharat / state

బై బోలో గణేశ్​ మహరాజ్​ కీ - గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి - Khairatabad Ganesh Nimajjanam 2024

Ganesh Immersion in Hussain Sagar 2024 : వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ ఖైరతాబాద్‌ సప్తముఖ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం, ఘనంగా పూర్తైంది. శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విజ్ఞాధిపతిని హుస్సేన్‌సాగర్‌లో నిజ్జమనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది.

Ganesh immersion in Hussain Sagar 2024
Khairatabad Ganesh Nimajjanam 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 1:39 PM IST

Updated : Sep 17, 2024, 2:30 PM IST

Khairatabad Ganesh Nimajjanam 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు, గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య సాగర్​ గర్భంలో నిమజ్జనమయ్యాడు. ఆ క్రతువు చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీంతో నగర నడిబొడ్డున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేశ్​ మహరాజ్​కీ జై అంటూ జయజయధ్వానాలు మార్మోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్ప పాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ పుత్రుడు చేరుకున్నాడు.

కనులపండువగా శోభాయాత్ర : 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకున్న గణేశుడు, ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తయిన మట్టి గణపతిగా రికార్డుకు ఎక్కాడు. స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రధాన గణపతి మండపానికి ఓవైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను చిన్న మండపాల్లో ఏర్పాటు చేయటం విశేషం.

తొలుత ఆయా విగ్రహాలను టస్కర్​లపైకి చేర్చి, అనంతరం భారీ క్రేన్ సహాయంతో ప్రధాన విగ్రహాన్ని (బడా గణేశ్) టస్కర్ పైకి చేర్చారు. గణపతిని టస్కర్ పైకి చేర్చిన తర్వాత వెల్డింగ్ పనులకే దాదాపు 4 గంటల సమయం పట్టింది. అనంతరం శోభాయాత్ర బయల్దేరే ముందు ఖైరతాబాద్ గణపతికి మరోమారు పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్, సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి, సెక్రటేరియట్ మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ క్రతువును కనులారా వీక్షించేందుకు తరలిన భక్తజనంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. ముందెన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

రూ.30.1 లక్షలు పలికిన బాలాపూర్​ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024

రికార్డు బ్రేక్​ రేటు : ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర - ఎక్కడో తెలుసా? - Ganesh Laddu Auction 2024

Last Updated : Sep 17, 2024, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.