ETV Bharat / state

త్వరలో ప్రజల ముందుకు కేసీఆర్ - ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం - KCR Takes Oath As Gajwel MLA

KCR Oath As MLA Telangana Assembly 2024: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ ఫిబ్రవరి 1న గజ్వేల్‌ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసనసభాపతికి శనివారం ఆయన లేఖ రాశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన విషయం తెలిసిందే.

KCR Takes Oath As MLA
KCR Takes Oath As MLA In Telangana Assembly
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 12:46 PM IST

KCR Oath As MLA Telangana Assembly 2024 : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ ఫిబ్రవరి 1వ తేదీన గజ్వేల్‌ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసనసభాపతికి శనివారం ఆయన లేఖ రాశారు. డిసెంబరు 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా అదే నెల 9న అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇటీవల ఆయన మెల్లమెల్లగా కోలుకోవడంతో వచ్చే గురువారం శాసనసభకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు.

KCR To Take Oath As Gajwel MLA : ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో అనూహ్యంగా ఆయన ఓటమిపాలయ్యారు. గజ్వేల్‌ నుంచి గెలుపొందారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

త్వరలో బీఆర్ఎస్ లోక్​సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్​ పోటీపై ఇదే క్లారిటీ

రాజీనామా తర్వాత ఎర్రవల్లికి పయనం : కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో కేసీఆర్ తన సీఎం పదవి రాజీనామా లేఖను నేరుగా గవర్నర్‌కు పంపించి అక్కడి నుంచి ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌస్‌కు వెళ్లారు.

KCR Takes Oath As MLA : ఈ క్రమంలో ఓ రోజు రాత్రి కేసీఆర్ ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముక విరిగిపోవడంతో యశోద ఆస్పత్రికి చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. డాక్టర్లు 8 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పడంతో కేసీఆర్ పూర్తిగా బెడ్ రెస్ట్​లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇటీవల ఆయన కోలుకొని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి : కేటీఆర్

బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.