ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రాజులు ఏలిన 'ప్రకృతి సోయగాలు' - ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత - Karimnagar Historic Places

Karimnagar Historic places : ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లినప్పుడు చారిత్రాక కట్టడాలు ఉన్నాయా? వాటి ప్రత్యేతక ఏంటి? అని తెలుసుకుంటుంటాం కదా. ఈ స్టోరీలో కరీంనగర్‌లోని కట్టడాలు, పురాతన దేవాలయాలు, జలపాతాల గురించి తెలుసుకుందాం.

Karimnagar Historic Places
Karimnagar Historic Places (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 10:02 AM IST

Karimnagar Historic Places : చారిత్రాక కట్టడాలు, పురాతన దేవాలయాలు, జలపాతాలు పర్యాటకుల మనసులను పులకరింపజేస్తాయి. యాత్రికులను ఆకట్టుకనే పుణ్యక్షేత్రాలు, రాజులు పాలించిన ప్రాంతాలను ఇప్పటికీ వేల మంది సందర్శిస్తున్నారంటే వాటి ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు, వసతులు కల్పిస్తే ఆదాయం మరింత సమకూరనుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పర్యాటక క్షేత్రాల విశేషాలు, వాటి అభివృద్ధి అనుకూలతలపై స్పెషల్‌ స్టోరీ.

ప్రదేశం : ఎలగందుల ఖిల్లా, కరీంనగర్‌ జిల్లా

నిర్మించినది : శాతవాహనులు. కోటి లింగాలను రాజధానిగా ప్రాంతీయ ఏడు రాజులు గోభద, నారన, కంవయస, సమగోప పాలనలో నిర్మితమైనట్లు లభ్యమైన నాణేలను బట్టి తెలుస్తుంది.

ప్రత్యేకత : ఈ కోట శాతవాహనులతోపాటు బాదామి చాళుక్యుల (550-750) నుంచి ఆసఫ్‌జాహీల(1724-1948) కాలం వరకు పాలన కేంద్రంగా విరాజిల్లింది. ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉండేది.

కల్పించాల్సిన సౌకర్యాలు : ఎలగందులు ఖిల్లా చారిత్రాక ప్రాంతం కావడంతో ప్రభుత్వం 2014లో పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. అప్పుడు సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల తర్వాత అది నిలిచిపోయింది. సామాగ్రి పాడైపోయింది. పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే గార్డెన్స్‌, పార్కులు, రెస్టారెంట్లు, రవాణా సౌకర్యాలు, వసతులు కల్పించాలి. కోట గురించి తరాల వారికి తెలిసే విధంగా తీర్చిదిద్దాలి.

ప్రదేశం : మొలంగూరు ఖిల్లా, కేశవపట్నం మండలం, కరీంనగర్‌ జిల్లా

నిర్మించినది : ప్రతాపరుద్రుని అధికారులలో ఒకరైన వొరగిరి మొగ్గరాజు దీనిని నిర్మించాడు.

ప్రత్యేకత : దూద్‌ బావి బహుళ ప్రాచుర్యం

కల్పించాల్సిన సౌకర్యాలు : మొలంగూరు గుట్టపైన, కింద కోనేరులు దూద్‌ బావి, శివాలయం, వీరభద్రాలయం, కోట బురుజులు, రాతి ద్వారాలు, కందకాలు, ఫిరంగులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న దూద్‌ బావలోని నీరు పాలవలె తెల్లగా ఉంటాయి. ఈ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆ గ్రామస్థులు నమ్ముతారు వాటిని తీసుకెళతారు. ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపడితే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అంటున్నారు.

ప్రదేశం : రామగిరి ఖిల్లా, కమాన్‌పూర్‌ మండలం బేగంపేట, పెద్దపల్లి జిల్లా

నిర్మించినది : శాతవాహనులు నిర్మించారని చారిత్రక అధారాలు చెబుతున్నాయి. వారు దీనిని రక్షణ కోటగా వినియోగించుకొని కోటి లింగాలను రాజధానిగా చేసుకొని పాలించారు.

ప్రత్యేకత : శత్రుదుర్భేద్యమైన ఈ కోట అరుదైన శిల్పకళ, బురుజులకు నిలయం. కోట పరిసర ప్రాంతాల్లో వనమూలికల సంపత్తి, అరుదైన వృక్షాలున్నాయి.

కల్పించాల్సిన సౌకర్యాలు :రామగిరి ఖిల్లా ప్రాంతంలో వనమూలికలు, అరుదైన వృక్షాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వస్తారు. ఈ కోటకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, కల్పించి అభివృద్ధి చేస్తే సుందరమైన ప్రదేశంగా విరాజిల్లుతుంది. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు బొటానికల్‌ గార్డెన్‌గా మారుతుంది.

ప్రదేశం : కరీంనగర్‌ మానేరు జలాశయం

సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకు కరీంనగర్‌లో మానేరు డ్యాం నిర్మాణం చేశారు. ఈ డ్యాంను ఆనుకొని ప్రభుత్వం ఉజ్వల, జింకల పార్కులు, హరిత హోటల్‌ నిర్మించారు.

కల్పించాల్సిన సౌకర్యాలు : మానేరు డ్యాంపై నీడ వసతి, ఫుడ్‌ కోర్టులు పెరిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. కొదురుపాక మధ్య మానేరులో వసతులు, సౌకర్యాలు పెంచితే బోటింగ్‌కు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఉజ్వల, జింక పార్కులను మరింత ఆకర్షించేలా తీర్చిదిద్దితే బాగుంటుంది.

హరిత హోటల్‌ను త్వరితగతిన వసతులు కల్పించాలి. ఇస్కాన్‌ టెంపుల్, టీటీడీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణంతోపాటు మానేరు రివర్‌ ఫ్రంట్, తీగల వంతెన ప్రాంతాలను తీర్చిదిద్దితే జిల్లాలో పర్యాటకులు పెరగుతారు. కోటి రూపాయాలతో తయారైన క్రూజ్‌ పడవను త్వరలో నడిపించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

ప్రదేశం : వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవాలయం

నిర్మించినది : పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుని మహా మండలేశ్వరుడైన రాజాదిత్యుడు రాజరాజేశ్వర దేవాలయం నిర్మించాడని శిలాశాసనం ద్వారా తెలుస్తుంది.

ప్రత్యేకత : దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడి దర్శనానికి వస్తుంటారు.

కల్పించాల్సిన సౌకర్యాలు : ప్రసాద్‌ లాంటి కేంద్ర పథకాలు వేములవాడతో పాటు కొండగట్టు, ధర్మపురి, ఇల్లందకుంట దేవాలయాల్లో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సైతం మరిన్ని నిధులు మంజూరు చేసి మైరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించాలి అలాగే రవాణా పరంగా రైల్వేలైన్‌ వేయాలి.

ప్రదేశం: గోదావరిఖని గనులు

సహజ నిక్షేపాలుగా బొగ్గు గనులు బయటపడ్డాయి.

ప్రత్యేకత : భూగర్భ గనుల తవ్వకాలు, ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ పనులతోపాటు పవర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి.

కల్పించాల్సిన సౌకర్యాలు : గతంలో ఆర్టీసీ, మైనింగ్‌ సంస్థలు కలిసి పర్యాటకుల సందర్శనకు అవకాశం కల్పించారు. బస్సులో తీసుకువచ్చి ఖనిలో జరుగుతున్న బొగ్గు గనుల తవ్వకాలు, ఆ ప్రాంత విశేషాలు చూయించేవారు. కానీ తర్వాత నిలిపివేశారు. పునరుద్ధరించాలని స్థానికులు, పలువురు కోరుతున్నారు.

పెద్దపల్లి జిల్లాలో ఆలయ గోపురం ధ్వంసం - గుప్తనిధుల కోసమే!

ఏకశిల సౌందర్యం భళా - మంచిర్యాలలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్​ - Gontemma Gutta in Bellampalle

బైరాన్​పల్లి బురుజు - రాణి శంకరమ్మ కోట - మెదక్​ జిల్లాలో ది బెస్ట్ షూటింగ్ స్పాట్స్ ఇవే - BHAIRANPALLI BURUJU IN MEDAK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.