ETV Bharat / state

YUVA : ఆవేదనలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన - సోలార్ డ్రైనేజీ మెషిన్​ని కనుక్కునే దిశగా అడుగులు - Karimnagar Students Developed Drainage System - KARIMNAGAR STUDENTS DEVELOPED DRAINAGE SYSTEM

Yuva On Solar Drainage Cleaner : వ్యర్థాలు తొలగించే యత్నంలో పారిశుద్ధ్య సిబ్బంది అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు కోకొల్లలు. మ్యాన్‌హోల్స్‌లోకి దిగి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు ఎందరో. ఇలాంటి సంఘటనలు తరచూ విని చలించిపోయారు ఈ విద్యార్థులు. ఇంజినీరింగ్ చివరి ఏడాదిలో చేసే ప్రాజెక్టు భాగంగా అవలీలగా చెత్తను తీసివేసే ఓ యంత్రాన్ని తయారుచేయాలని నిర్ణయించుకున్నారు. అలా చేసిందే ఈ 'లో కాస్ట్‌ సోలార్‌ పవర్‌ డ్రైన్‌ క్లీనింగ్ మెషిన్‌'.

Yuva On Solar Drainage Cleaner
Yuva On Karimnagar Students Develop Solar Drainage System (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 2:55 PM IST

ఆవేదనలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన విద్యార్థులను సోలార్ డ్రైనేజీ మెషిన్​ని కనుక్కునే బాటపట్టించింది (ETV Bharat)

Yuva On Karimnagar Students Develop Solar Drainage System : కరీంనగర్‌ జిల్లా సింగాపూర్‌ కిట్స్‌ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్‌ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నారు ఈ ఐదుగురు విద్యార్థులు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు తొలగించే క్రమంలో మనదేశంలో ఎంతమంది పారిశుద్ధ్య కార్మికుల మృతి చెందారో తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు. వారి సౌలభ్యం కోసం తమవంతు ప్రయత్నంగా మానవ రహిత యంత్రాన్ని రూపకల్పన చేయాలని భావించారు.

తమ ఆలోచనలను కళాశాల మెకానికల్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.వి.సతీష్‌కుమార్‌తో పంచుకొన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో అవసరమైన పరికరాలు సమకూర్చుకున్నారు. తక్కువ ఖర్చుతోనే విజయవంతంగా యంత్రం రూపొందించి దీనికి 'లో కాస్ట్‌ సోలార్‌ పవర్‌ డ్రైన్‌ క్లీనింగ్ మెషిన్‌' అని నామకరణం చేశారు. సోలార్ విద్యుత్‌తో నడిచే ఈ యంత్రాన్ని 2 వారాల్లోనే పూర్తిచేశామని విద్యార్థులు తెలిపారు. నాలాల నుంచి చెత్తను సులువుగా ఎత్తేసేలా సోలార్‌ డ్రైన్ క్లీనర్‌ను తీర్చిదిద్దారు. దీనికి అమర్చిన చైన్లు తిరగుతూ ఉంటే ప్లేటు ఒకేసారి పైకి వచ్చిన చెత్త వెనుక భాగంలో ఒక ట్రేలో పడుతుంది. దాని నుంచి సరాసరి మెషిన్ కింద ఉంటే డబ్బాలో పడేలాగ రూపకల్పన చేశారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ యంత్రానికి ఉన్న ఇతర ప్రత్యేకతలేంటో వివరిస్తున్నారు.

YUVA : కూచిపూడిలో అద్భుత ప్రదర్శనలిస్తున్న అభిజ్ఞ - చిరు ప్రాయంలోనే రెండు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సొంతం - Nizamabad Classical Dancer Abhigna

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంజినీర్స్​ నుంచి ఆర్థిక సహాయం : ప్రస్తుతం నమూనా దశలోనే ఉన్న సోలార్ డ్రైనేజీ క్లీనర్‌ను అవసరమైతే సామర్థ్యాన్ని పెంచుకోని కూడా వాడవచ్చని అంటున్నారు. ఈ ఆవిష్కరణ కోసం ఉపయోగించిన పరికరాలు, సాధనాలు తయారీ విధానం గురించి చెబుతున్నాడు విద్యార్థి కృష్ణమాధవ్‌. ఈ ప్రాజెక్టు తయారీకి 38వేల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు. దీని తయారీకి గాను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా నుంచి రూ.20వేల ఆర్థిక సహాయం లభించిందని అంటున్నారు. ఈ యంత్రాన్ని ఒక చోట నుంచి మరో చోటుకి అవలీలగా తరలించేలా రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నారు.

"ఈ మెషిన్​ ద్వారా నాలాలా, డ్రైనేజీలో ఉండే చెత్తను తొలగించవచ్చు. ఇది సోలార్ ఎనర్జీతో పని చేస్తుంది. దీంతో ఒక మనిషి డ్రైనేజీని క్లీన్​ చేయాల్సిన అవసరం లేదు. ఇది తయారు చేయడానికి మాకు 38వేల ఖర్చు వచ్చింది. ఇలాంటివి ఇంకా తయారు చేస్తే ఖర్చు తగ్గుతుంది." - విద్యార్థులు

సమాజానికి ఉపయోగపడేలా ఇలాంటి ఆవిష్కరణ తయారీకి తమ విద్యార్థులు రూపకల్పన చేయడం ఆనందంగా ఉందంటున్నారు కళాశాల సిబ్బంది. విద్యార్థుల ఆలోచన విజయవంతం అయ్యేలా ప్రోత్సాహం అందించామని అంటున్నారు. చదివిన చదువుకు సార్థకత చేకూరుస్తూ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొనే సమస్యలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేసి ప్రశంసలు పొందుతున్నారు.

YUVA - తొలి సినిమాతోనే మెప్పించిన యువ దర్శకుడు - 12 ఏళ్ల తర్వాత కలను సాకారం చేసుకున్న మెదక్ కుర్రాడు - Yuva on Movie Director Prashanth Reddy

YUVA : పేదింటి పెన్సిల్​ ఆర్టిస్టు - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.