Kannada TV Actress Shobitha Suicide: కన్నడ బుల్లి తెర నటి శోభిత హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శోభిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో శోభిత నటించారు. శోభిత గతేడాది వివాహం చేసుకున్నారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్ సీ బ్లాక్‌లో భర్త సుధీర్‌తో నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్నప్పటి నుంచీ శోభిత నటనకు దూరంగా ఉంటున్నారు. శోభిత ఆత్మహత్యపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాల తెలియాల్సి ఉంది.