ETV Bharat / state

అటకెక్కిన జగనన్న హామీ - కదిరిలో వంద పడకల ఆస్పత్రి ఇక కలేనా - Hospital Construction Delay

Kadiri Hospital Building Construction Delay Patients Suffer in Satya Sai District : ఆస్పత్రికి కొత్త భవనం కడతామంటే అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కాంట్రాక్టర్​ మధ్యలోనే వెళ్లిపోయాడు. పనులు వేరే కాంట్రాక్టర్​కు అప్పగించినా పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. నాలుగేళ్లయినా పనులు పూర్తి కాకపోవడం వల్ల రోగులు అవస్థలు పడుతూనే ఉన్నారు. జగనన్న ఇచ్చిన హామీ ఏమైందని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 4:52 PM IST

hospital_building_construction_delay_patients_suffer_in_satyasai_district

అటకెక్కిన జగనన్న హామీ - కదిరిలో వంద పడకల ఆస్పత్రి ఇక కలేనా

Kadiri Hospital Building Construction Delay Patients Suffer in Satya Sai District : ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని కూలగొట్టి అధునాతన సేవలతో మెరుగైన సేవలు అందించే విధంగా నూతన భవనం నిర్మాణం చేస్తున్నారని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఆ ఎదురు చూపులకు నాలుగేళ్లు అయినా ఆస్పత్రి నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.

నాడు - నేడు కష్టాలు తీర్చలేదు

Patients Fires on YSRCP Government : వంద పడకల ఆసుపత్రికి ఆధునాతన సౌకర్యాలతో కూడిన కొత్త భవన సముదాయాన్ని అందుబాటులోకి తెస్తామన్న జగనన్న హామీ అటకెక్కింది. ఉన్న భవనాలను కూల్చివేసి కొత్త వాటి నిర్మాణం పూర్తి కాక ఆరు బయటే రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితిని వైద్యులు ఎదుర్కొంటున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలో నూతన భవన సముదాయ నిర్మాణానికి నాబార్డ్ నుంచి 18 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి.

పార్వతీపురం జిల్లా ఆస్పత్రి పనులు నత్తనడక - రోగులకు తిప్పలు

No Medical Facilities in Satyasai : నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 2020 అక్టోబర్ 26వ తేదీన నిర్మాణ పనుల ప్రారంభానికి వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. 2022 డిసెంబర్ నాటికి కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్న ప్రజా ప్రతినిధుల హామీ నాలుగేళ్లయినా నెరవేరలేదు. పనులు ప్రారంభించిన గుత్తేదారుడిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు పెరిగాయి. వారితో వేగలేని గుత్తేదారు పనులను ప్రారంభ దశలోనే ఆపివేసి వెళ్లిపోయారు. వైద్య ఆరోగ్యశాఖ ఒత్తిళ్లతో ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణ పనులను మరో గుత్తేదారుడికి అప్పగించినా పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి.

ఆరోగ్యశ్రీ పేరుతో ఆసుపత్రిలో భారీ కుంభకోణం- పర్మిషన్స్ రద్దు

People Problems : అప్పటి వరకు ఓపీ సేవలందించేందుకు అందుబాటులో ఉన్న భవన సముదాయంలోని సామగ్రిని తమ అనునాయులకు అప్పగించే ఉద్దేశంతో ఓ వైఎస్సార్సీపీ నాయకుడు ఈ గదినీ కూల్చి వేయించాడు. ప్రస్తుతం ఓపి విభాగాన్ని ఓ చిన్న గదిలో నిర్వహించాల్సి వస్తోంది. ఇక్కడ కొన్ని సేవలను ఆరు బయటనే అందిస్తున్నారు. రోగులతో పాటు ఉండే సహాయకులు ఆసుపత్రి ఆవరణలో గోడల కింద, ఆసుపత్రి ఆవరణలో ఎక్కడో ఒకచోట తలదాచుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి ఇప్పటికైనా నూతన భవన సముదాయాన్ని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వైద్యులు కోరుతున్నారు.

చీకట్లో ప్రభుత్వ ఆసుపత్రి - సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్య సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.