ETV Bharat / state

"కడప నయీం డిప్యూటీ సీఎం సోదరుడు-వెంటనే నగర బహిష్కరణ చేయాలి"

Kadapa TDP Leaders Complaint to SP: కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా నుంచి తమకు ప్రాణహాని ఉందని కడప తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అండదండలతో దాడులకు పాల్పడటమే కాకుండా బూతు పురాణం వల్లెవేస్తూ మహిళలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అహ్మద్ బాషాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.

Kadapa_TDP_Leaders_Complaint_to_SP
Kadapa_TDP_Leaders_Complaint_to_SP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 7:23 AM IST

Updated : Feb 10, 2024, 5:17 PM IST

"కడప నయీం డిప్యూటీ సీఎం సోదరుడు-వెంట నేనగర బహిష్కరణ చేయాలి"

Kadapa TDP Leaders Complaint to SP : కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల అండదండలతో దాడులకు పాల్పడటమే కాకుండా బూతు పురాణం వల్లెవేస్తూ మహిళలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సోదరుడు అహ్మద్ బాషా వ్యవహారశైలి గ్యాంగ్ స్టర్ నయీం తరహాలో ఉందని అతన్ని వెంటనే నగర బహిష్కరణ చేయాలని తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా దౌర్జన్యాలు, దోపిడీలు తారా స్థాయికి చేరాయని కడప తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కడపలో అహ్మద్ బాషా నుంచి తమకు ప్రాణహాని ఉందని, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తెలుగుదేశం కడప ఇంఛార్జి మాధవీరెడ్డిపై అసభ్యకరంగా మాట్లాడిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఏడాది కిందట వినాయక్ నగర్ లో ఓ మైనారిటీ నాయకుడి స్థలాన్ని ఆక్రమించేందుకు అహ్మద్ బాషా తన అనుచరులతో హల్ చల్ చేయడం తీవ్ర దుమారం రేపింది.

అహ్మద్ బాషా కడప నయీం కావాలని చూస్తున్నాడు: టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి

శుక్రవారం టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగగా టీడీపీ కార్యకర్త అరీఫుల్లాపై పోలీస్ స్టేషన్​లోనే మంత్రి సోదరుడు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, అతని భార్య మాధవీరెడ్డిని ఉద్దేశిస్తూ ఇంటికి వచ్చి దాడి చేస్తానని మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా పోలీసులు మిన్నకుండిపోయారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం సీసీ టీవీలో నమోదైందని అంజాద్ బాషా సోదరుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాధవీరెడ్డి, టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.

వైసీపీ పాలనలో అరాచకాలు - టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : వరదరాజులు

ఇటీవల ముద్దనూరులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెచ్చిపోయి టీడీపీ నేతలను దూషిస్తూ, దాడులు చేయడం వివాదాస్పదం అయింది. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వరస దాడులకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు శాంతి భద్రతలను అదుపులో పెట్టకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నేత శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

జగన్‌ పాలనలో రక్షక భటులకే రక్షణ కరవు- పోలీసులపై జులుం ప్రదర్శిస్తున్న వైఎస్సార్​సీపీ నాయకులు

Last Updated : Feb 10, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.