ETV Bharat / state

సాక్ష్యాలు పరిశీలించాక ఎవర్ని విచారణకు పిలవాలో నిర్ణయిస్తాం : జస్టిస్ పీసీ ఘోష్ - Justice PC Ghose On Kaleshwaram - JUSTICE PC GHOSE ON KALESHWARAM

Justice PC Ghose On Kaleshwaram Inquiry : కాళేశ్వరం ఆనకట్టలపై అన్ని అంశాలు, సాక్ష్యాలు పరిశీలించాకే విచారణకు ఎవరిని పిలవాలో నిర్ణయిస్తామని కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన జ్యుడిషియన్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు. సాంకేతికంగా అన్నిఅంశాలు పరిగణనలోకి తీసుకుని కాళేశ్వరం ఆనకట్టపై విచారణ సాగుతుందని ఆయన వివరించారు.

Justice PC Ghose On Kaleshwaram Inquiry
Justice PC Ghose On Kaleshwaram Inquiry
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 4:12 PM IST

Justice PC Ghose On Kaleshwaram Inquiry : సాంకేతికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సాక్ష్యాలు, వాస్తవాల ప్రాతిపదికన కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ సాగుతుందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని చెప్పారు. సాంకేతికంగా, అన్ని రకాలుగా అన్ని అంశాలు పరిశీలిస్తానని తెలిపారు. మేడిగడ్డ ఆనకట్ట లోపాలు, అంశాలపై బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వెల్లడించారు.

Justice PC Ghose On Medigadda Project Report : ఎవరైనా అఫిడవిట్ దాఖలు చేసి అభిప్రాయాలు చెప్పవచ్చని, సాక్ష్యాలు సమర్పించవచ్చని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఇందుకోసం నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత సమన్లు జారీ చేసి ఆనకట్టల పనులతో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలుస్తామని వివరించారు.

మేడిగడ్డ ఆనకట్టపై అధ్యయనం చేసిన ఎన్‌డీఎస్ఏ కమిటీ నుంచి నివేదిక త్వరగా తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు పీసీ ఘోష్ చెప్పారు. ఇంజినీర్లు, ఎన్​డీఎస్ఏ కమిటీతో సమావేశమవుతామన్న ఆయన అవసరమైతే ఐఐటీ తదితర సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటామని పేర్కొన్నారు.

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్‌డీఎస్‌ఏ అధ్యయనం - సీకెంట్‌ పైల్‌ పద్ధతికే మొగ్గు ఎందుకు? - NDSA Committee On Kaleshwaram

వాస్తవాలు, సాక్ష్యాలు ఆధారంగా న్యాయవిచారణ : కాళేశ్వరంపై కంప్ట్రోలర్ అండ్ జనరల్(కాగ్) కాగ్ ఇచ్చిన నివేదికను చివర్లో పరిశీలిస్తానని అన్నారు. తదుపరి పర్యటనలో మేడిగడ్డ వెళ్లి ఆనకట్టను పరిశీలిస్తానని తెలిపారు. అన్ని అంశాలు, సాక్ష్యాలు వచ్చాక విచారణకు ఎవరిని పిలవాలో నిర్ణయిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ను విచారణకు పిలుస్తారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా జస్టిస్ ఘోష్ చెప్పారు.

తాను ముఖాలను చూసి విచారణ చేయబోనని వాస్తవాలు, సాక్ష్యాల ప్రాతిపదికన న్యాయపరిధిలో విచారణ కొనసాగుతుందని అన్నారు. వంద రోజుల్లోపు విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్న జస్టిస్ ఘోష్ ప్రజాప్రయోజనం దృష్ట్యా వీలైనంత త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

జస్టిస్ పీసీ ఘోష్​ను కలిసిన మంత్రి ఉత్తమ్ : మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలపై న్యాయవిచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్​ను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాళేశ్వరం విచారణ కమిషన్ ఛైర్మన్​గా అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

కాళేశ్వరంపై కమిషన్‌ న్యాయ విచారణ షురూ - రేపు బ్యారేజీల సందర్శన - judicial inquiry on kaleshwaram

కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ - రిటైర్డ్ జడ్జి నియామకం సహా టైమ్ ​లిమిట్​కు కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.