ETV Bharat / state

నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ - అఫిడవిట్లపై జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్‌ ఎగ్జామినేషన్ - JUSTICE PC GHOSE KALESHWARAM - JUSTICE PC GHOSE KALESHWARAM

Investigation on Kaleshwaram Issue : కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన విచారణలో బుధవారం(నేటి) నుంచి తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేయగా ఇవాళ విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు.

Investigation on Kaleshwaram Project
Investigation on Kaleshwaram Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 7:49 AM IST

Updated : Aug 21, 2024, 8:32 AM IST

Justic PC Ghose Commission on Kaleshwaram Project : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి దశ బుధవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానుంది. విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదుల శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, పదవీ విరమణ చేసిన వారు, ఇతరులను విచారణ చేసింది. వారి నుంచి అవసరమైన విషయాలను ఆరా తీసిన కమిషన్ అందరి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. కమిషన్ ముందు ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. తదుపరి దశలో వారందరినీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.

ఆ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కమిషన్ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్‌లోనే ఈ బహిరంగ విచారణ ప్రక్రియ జరగనుంది. కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవసరమైన వారు న్యాయవాదులను కూడా వెంట తెచ్చుకునే వెసులుబాటు ఉంది.

రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్​ విచారణ : ఇవాళ మొదటి రోజు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్​గా సుధీర్ఘ కాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. మురళీధర్ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్, అందులోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు, అంశాల్లోని తీవ్రతను పట్టి రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్ విచారణ చేయనుంది. వాటి ఆధారంగా అవసరమైతే ఇతరులకు కూడా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. ఆనకట్టలపై విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం మధ్యంతర నివేదికను కమిషన్​కు సోమవారం సమర్పించింది. ఆ నివేదికను కూడా కమిషన్ సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనుంది.

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టడమే ప్రధాన తప్పు : విద్యుత్ శాఖ ఇంజినీర్ రఘు - Probe On Kaleshwaram Project

3 ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు - కొందరు గత ప్రభుత్వ పెద్దలకు దగ్గరి వారు! - PC Ghosh Commission Inquiry Update

Last Updated : Aug 21, 2024, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.