ETV Bharat / state

ఆనకట్టల్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది - తప్పుడు సమాచారమిస్తే చట్టపరమైన చర్యలు : జస్టిస్ పీసీ ఘోష్ - Justice PC Ghose on Kaleshwaram - JUSTICE PC GHOSE ON KALESHWARAM

Justice PC Ghose Chit Chat on Kaleshwaram : కాళేశ్వరంపై న్యాయ విచారణ కొనసాగుతోందని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. బ్యారేజీల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. లోపం ఎక్కడుంది ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామన్నారు.

Justice PC Ghose Chit Chat on Kaleshwaram
Justice PC Ghose Chit Chat on Kaleshwaram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 8:15 AM IST

Kaleshwaram Project Judicial Inquiry Updates : ఆనకట్టల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ (పీసీ ఘోష్‌) వ్యాఖ్యానించారు. లోపం ఎక్కడుంది? ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో మీడియాతో జస్టిస్ పీసీ ఘోష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

Kaleshwaram Barrages Issue Updates : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల బాధ్యతలను పర్యవేక్షించిన ఇంజినీర్ల విచారణ కొనసాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఇప్పటికే మూడింటి సమాచారాన్ని తెలుసుకున్నామని చెప్పారు. విచారణకు హాజరవుతున్న వారంతా ఈ నెల 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించామని పేర్కొన్నారు. బ్యారేజీల్లో చోటుచేసుకున్న సంఘటనలు, తెలిసిన అంశాలను అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని ఇప్పటికే చెప్పామని అన్నారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో ఇంజినీర్ల విచారణ జరిగిందని, ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధులను పిలువనున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు.

బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే లాభమే : నిర్మించిన ఆనకట్టలు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమే తప్ప నష్టం ఉండదని జస్టిస్‌ పీసీ ఘోష్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏవో తప్పుడు లెక్కలతోనే ఇలా జరిగినట్లు అనిపిస్తోందని చెప్పారు. విచారణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇతరుల వద్ద ఏదైనా సమాచారముంటే అఫిడవిట్‌ రూపంలో సమర్పించవచ్చని జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు.

Kaleshwaram Project Judicial Inquiry Updates
విచారణకు హాజరైన నీటిపారుదల శాఖ అప్పటి క్వాలిటీ కంట్రోల్‌ సీఈ వెంకటేశ్వర్లు, ప్రస్తుత సీఈ వెంకటకృష్ణ, అప్పటి ఎస్‌ఈ, ప్రస్తుత సంగారెడ్డి సీఈ అజయ్‌కుమార్, ప్రస్తుత ఎస్‌ఈ దేవేందర్‌రెడ్డి (ETV Bharat)

విచారణకు 18 మంది ఇంజినీర్లు : మంగళవారం నాడు విచారణకు 18 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు గతంలో ఆయా విభాగాల్లో పనిచేసిన వారిని కూడా కమిషన్‌ విచారణకు పిలిచింది. ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్రరావు, ఎస్‌డీఎస్‌ఓ విభాగం నుంచి సీఈ ప్రమీల, ఎస్‌ఈ మురళీకృష్ణ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి సంబంధించి గతంలో సీఈగా పనిచేసిన వెంకటేశ్వర్లు, ఎస్‌ఈగా పనిచేసి ప్రస్తుతం సంగారెడ్డి సర్కిల్‌ సీఈగా ఉన్న అజయ్‌కుమార్, ప్రస్తుత సీఈ వెంకటకృష్ణ, మేడిగడ్డ ఆనకట్ట సీఈ సుధాకర్‌రెడ్డి, గతంలో ఎస్‌ఈగా పనిచేసి ఇప్పుడు మహబూబ్‌నగర్‌ సీఈగా ఉన్న రమణారెడ్డి హాజరయ్యారు.

ఎస్‌ఈలు కరుణాకర్, దేవేందర్‌రెడ్డి ఈఈలు విష్ణుప్రసాద్, మల్లికార్జున ప్రసాద్, తిరుపతిరావు, రఘురాం, ఓంకార్‌ సింగ్‌ తదితరులు సైతం హాజరయ్యారు. నిర్మాణాలను ఏవిధంగా చేపట్టారు నమూనాలు, కట్టడాల విధానంతోపాటు ఆ సమయంలో నిర్ధారించిన లోపాలపై విచారణ సాగినట్లు తెలిసింది. అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన వివరాలతోపాటు తెలిసిన అంశాలపై కమిషన్‌ విచారణ చేసినట్లు తెలుస్తోంది.

నేడు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పిలుపు : ఇవాళ కమిషన్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను నిర్మించిన గుత్తేదారు సంస్థల ప్రతినిధులను విచారించనుంది.నవయుగ, అప్కాన్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలకు చెందిన వారితోపాటు మొత్తం 20 మందిని విచారణకు పిలిచినట్లు తెలిసింది.

మేడిగడ్డ ఆనకట్టపై విచారణ ముమ్మరం - వర్షాకాలంలోపు చేయాల్సిన పనులపై కమిషన్ దృష్టి - JUDICIAL INQUIRY ON MEDIGADDA ISSUE

కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? : జస్టిస్‌ పీసీ ఘోష్‌ - Judicial Inquiry On Kaleshwaram

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.