Notices To KCR in Chhattisgarh Power Purchase Deal : యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30వ తేదీ వరకు సమయం కోరగా జూన్ 15వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
- ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- అర్వింద్, ఎస్.కె.జోషికు నోటీసులు ఇచ్చాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- సురేష్ చందా, అజయ్ మిశ్రాకు నోటీసులు ఇచ్చాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- ఇప్పటి వరకు 25 మంది వివరణ ఇచ్చారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- వివరణ సంతృప్తిగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- టెండర్ ప్రక్రియ లేకుండా ఇచ్చారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- అత్యవసరంగా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి టెండర్ ప్రక్రియకు వెళ్ళలేదు అన్నారు
- భద్రాద్రిలో మాత్రమే సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- కోదండరామ్, రఘు, వేణుగోపాలరావు కూడా వివరణ ఇచ్చారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి