JSP leader Nadendla Manohar sensational allegations on volunteer system: పవన్‌కల్యాణ్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చెప్పిన విషయాలపై కేసు నమోదు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కోర్టుకు హాజరై అన్ని విషయాలను వివరిస్తారని నాదెండ్ల వెల్లడించారు. ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ 'బొమ్మ' చూపిస్తోన్న జగన్ సర్కార్
ప్రశ్నిస్తే మంత్రుల ఎదురుదాడి: వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా పోలీసులు, మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ల కోసం ఏటా రూ. 1560 కోట్లు ఖర్చు చేశారని, రూ.1560 కోట్లలో రూ.617కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రతి నెలా 51 కోట్ల రూపాయలు ఎవ్వరి జేబులోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం చట్టబద్ధత లేని వాలంటీర్ల వ్యవస్థ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థకు కట్టబెడుతోందని పేర్కొన్నారు. వాలంటీర్లకు శిక్షణ పేరుతో సంవత్సరాని 15 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నారని నాదెండ్ల ఆరోపించారు.
సూపర్ 6 మ్యానిఫెస్టో చూసి జగన్ భయపడుతున్నారు: లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉంటే, వారిలో లక్షా 2వేల 836 మంది వివరాలు అసలు రికార్డుల్లో లేదన్నారు. కేవలం 5వేల జీతం ఇస్తూ వాలంటీర్లను జగన్ స్టార్ క్యాంపెయినర్లలా వాడుకుంటున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాలను చెబితే, పవన్‌కల్యాణ్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమ కేసులకు భయపడేది లేదని నాదెండ్ల పేర్కొన్నారు. నిధుల కేటాయింపునకు సంబంధించి కనీసం బడ్జెట్ లో కూడా ప్రొవిజన్ పెట్టలేదన్నారు. వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థకు వెళ్ళిపోతుందని ఆరోపించారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థకు నిధుల కేటాయింపుపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తే దానిపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ కేసుని కుట్రపూరితంగా అభివర్ణించారు. వాలంటీర్లలో 21వేల మంది పీజీ చేసినవారున్నారని, రూ.5వేల కోసం వారు వచ్చారంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుందన్నారు. వాలంటీర్ల వ్యవస్తపై పవన్ కల్యాణ్ మాట్లాడితే దానిపై వైసీపీ ప్రభుత్వం కేసు పెట్టి సమన్లు జారీ చేసిందన్నారు. పవన్ కల్యాణ్ కోర్టుకు హాజరై అన్ని విషయాలను వివరిస్తారని తెలిపారు.
గొప్పలు అదుర్స్, రాబడి రివర్స్ - జగన్ పాలనలో మరింత వెెనక్కి