Stone Crushers Owners Problems in Joint Guntur Dist : జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్టోన్క్రషర్ల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని యజమానులు వాపోతున్నారు. గడిచిన ఐదేళ్లుగా నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించాయని చెబుతున్నారు. దీంతో కంకర వినియోగం తగ్గి వ్యాపారాలు నష్టాల్లో నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎక్కడా లేని విధంగా ఏఎంఆర్ సంస్థకు రాయల్టీ వసూలు బాధ్యతను గత సర్కార్ అప్పగించిందన్నారు. ఫలితంగా టన్నుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా యజమానులపై భారం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. రాయితీ వసూళ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొంటున్నారు.
"పక్క జిల్లాలో రాయల్టీ వసూలు లేవు. ప్రకాశం, కృష్ణాజిల్లాల్లో ఈ విధానం అమలు లేదు. పేరంచర్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. తద్వారా స్టోన్‌క్రషర్లు నడపలేని పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్లలో వ్యాపారాలు సరిగ్గా సాగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం." - బాలకృష్ణ, స్టోన్‌క్రషర్ నిర్వాహకుడు,పేరేచర్ల
Increased Stone Crushers Royalty : గుంటూరు జిల్లా పేరేచర్ల ప్రాంతంలో సుమారు 25 వరకు స్టోన్‌క్రషర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాకు కంకర సరఫరా జరుగుతోంది. 2014లో రూ.200 నుంచి రూ.300 టన్నుల సామర్థ్యంతో పనిచేసే స్టోన్‌క్రషర్లు ఉండేవి. అమరావతి నిర్మాణం ప్రారంభించిన తర్వాత 1000 నుంచి 2000 టన్నులకు యజమానులు పెంచుకున్నారు. ఆధునిక యంత్రపరికరాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. రాజధానిలో భవన నిర్మాణ రంగం ఊపందుకోవడం, రహదారుల నిర్మాణాలతో కంకరకు బాగా డిమాండ్ ఉండేది. ఒక్కో స్టోన్‌క్రషర్ కింద వందలాది మంది కార్మికులు, డ్రైవర్లు పని చేసేవారు.
క్రషర్ల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన : కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. దీంతో స్తిరాస్థి వ్యాపారం మందగించి కంకరకు డిమాండ్ తగ్గింది. వీటికి తోడు రాయల్టీ వసూలుతో పరిస్థితి మరింత దిగజారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన రాయితీ వసూలు విధానం అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. కానీ పక్కనే ఉన్న ప్రకాశం, కృష్ణాజిల్లాల్లో ఈ విధానం లేకపోవడంతో ఆ ప్రభావం తమ వ్యాపారం మీద పడుతుందని ఆందోళన చెందుతున్నారు. గత సర్కార్ తీసుకొచ్చిన రాయల్టీ విధానం తాము చాలా నష్టపోయామని నిర్వాహకులు వాపోతున్నారు.
ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులు : దీంతో స్టోన్‌క్రషర్లు మూసేయడం తప్ప మరో గత్యంతరం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు తమ ఉపాధి పోతుందని కార్మికులకు వాపోతున్నారు. రాయల్టీ వసూలుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని యజమానులు కోరుతున్నారు. అప్పుడే తమ వ్యాపారాలు నిలబడతాయని వారు అంటున్నారు.
stone crusher: కష్టాల్లో స్టోన్ క్రషర్ల నిర్వాహకులు.. ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి