ETV Bharat / state

జేఈఈ షెడ్యూల్ వచ్చేసింది - పరీక్షలు సహా ఫలితాల తేదీలు​ ఎప్పుడెప్పుడంటే? - JEE MAINS SCHEDULE RELEASED 2025

జేఈఈ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్‌టీఏ - రెండు సెషన్లుగా పరీక్షలు - సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్‌లో నిర్వహించనున్న ఎన్‌టీఏ

JEE Mains Exams Dates Announced
JEE Mains Exams Dates Announced (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 10:26 PM IST

JEE Mains Exams Dates Announced : ఐఐటీలు, ఎన్‌ఐటీలు, త్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షా షెడ్యూల్​ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను జేఈఈ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ - ఎన్​టీఏ తెలిపింది. తొలిదఫా పరీక్షలను 2025 జనవరిలో, రెండో దఫా ఏప్రిల్​లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జనవరిలో జరగనున్న పరీక్షల కోసం నేటి నుంచి నవంబర్ 22 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొంది.

పరీక్షలను నిర్వహించనున్న కేంద్రాల వివరాలను జనవరి మొదటి వారం లోపు ప్రకటిస్తామని ఎన్​టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31 తేదీల్లో జేఈఈ తొలిదఫా పరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరి 12 లోపు ఫలితాలు విడదల చేస్తామని పేర్కొంది. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్న ఎన్​టీఏ సిలబస్​ని సైతం ఖరారు చేసింది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఎన్​టీఏ వెబ్​సైట్​ని సందర్శించాలని పేర్కొంది.

టాప్ ర్యాంక్​ దక్కించుకున్న వారికే ఐఐటీ, ఎన్​ఐటీలు, త్రిపుల్​ ఐటీల్లో ప్రవేశం : గత ఏడాది సెషన్ -1 ను జనవరి 24న తేదీన నిర్వహించారు. ఈసారి 2 రోజులు ముందుకు జరిపి 22 నుంచి నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ టెస్ట్ కోసం సుమారు 14లక్షల మందికి పైగానే పోటీ పడుతుంటారు. ఇందులో టాప్ ర్యాంక్​ దక్కించుకున్న వారికే ఐఐటీ, ఎన్​ఐటీలు, త్రిపుల్​ ఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఐఐటీ జేఈఈ ఎగ్జామ్​ టాప్ ​-2లో ఉంది. టాప్​ -1లో చైనాలో ‘గవోకావో’ పరీక్ష మొదటి స్థానంలో ఉంది.

జేఈఈ, నీట్​ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? - మీ కోసమే ఫ్రీ కోచింగ్ - ఎక్కడంటే?

ఇకపై ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవ్- JEE మెయిన్‌ ఎగ్జామ్​లో బిగ్ ఛేంజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.