JEE Main-2025 West Godavari Students Allotted Exam Centers Against Preferred Choice : జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులకు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించడంతో వారు ఆశ్చర్యపోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఇంటర్ చదువుతున్న కె.తేజచరణ్, పి.సాయిలోకేశ్ జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వివరాలను ఇటీవల ఎన్‌టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) విడుదల చేసింది.
ఈ క్రమంలో తమ పరీక్ష కేంద్రాల వివరాలను తేజచరణ్, సాయిలోకేశ్‌లు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందులో వారు ఐచ్ఛికంగా పెట్టుకున్న కేంద్రాలు కాకుండా ఈ నెల 29న జరిగే పేపర్-1 (బీటెక్)కు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో కేంద్రాన్ని కేటాయించగా 30న నిర్వహించే (బీ ఆర్క్) పేపర్-2కు విశాఖపట్నంలో కేటాయించారు. వెంటనే విద్యార్థుల కుటుంబసభ్యులు ఎన్‌టీఏను సంప్రదించగా సరైన స్పందన రాలేదు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులకు అలర్ట్ - ఆ తరగతుల్లో ఇంటర్నల్ మార్కుల విధానం!
'ప్రిపర్డ్ సెంటర్ల కోసం దగ్గర్లో ఉన్న భీమవరం, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి సెటర్లు పెట్టుకున్నాం.అయితే ఇక్కడ నుంచి దాదాపు 3వేల కిలోమీటర్ల దూరంలోని కార్గిల్‌లో పడటం ఎంతో బాధాకరం. 29 తారీఖు బీటెక్ పరీక్షకు సెంటర్ కార్గల్లో వేశారు. 30వ తేదీ బీర్కే పరీక్ష సెంటర్ వైజాగ్‌లో వేశారు. ఫ్లైట్‌లో వెళ్లినా అంత దూరం వెళ్లలేము. మా తల్లి దండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను మెయిన్స్ బాగా రాసి ఎన్ఐటీ, ఐఐటీలో సీట్ సాధించాలని కలగన్నాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు.' -బాధిత విద్యార్థి
ఏపీ యువతకు గుడ్‌న్యూస్ -ఈ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ప్రకటించిన APPSC