ETV Bharat / state

హైదరాబాద్​లో జాన్వీ కపూర్ సందడి​ - మధురానగర్​ హనుమాన్​ ఆలయంలో ప్రత్యేక పూజలు - JANHVI KAPOOR VISITS HANUMAN TEMPLE

మధురానగర్​ ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీకపూర్​ - ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు

Janhvi Kapoor visits Hanuman temple
Janhvi Kapoor visits Hanuman temple (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 11:38 AM IST

Updated : Nov 7, 2024, 12:05 PM IST

Janhvi Kapoor visits Hanuman temple : ప్రముఖ సినీనటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ హైదరాబాద్​లోని హనుమాన్​ ఆలయానికి వచ్చారు. మధురానగర్​లోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాదాపు అరగంట పాటు జాన్వీకపూర్​ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జాన్వీ కపూర్​ ఆలయానికి వచ్చారనే విషయం తెలుసుకుని స్థానికులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జాన్వీతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్​కు భక్తి ఎక్కువనే విషయం విధితమే. సినిమా షూటింగ్​లలో విరామ సమయాల్లో ఆమె అప్పుడప్పుడు పలు ఆలయాలను సందర్శిస్తుంటారు.

Janhvi Kapoor visits Tirumala Temple : యువనటి జాన్వీకపూర్​కు దైవభక్తి మెండు. అమె తరచూ తిరుమలను సందర్శిస్తుంటారు. కొద్ది రోజుల క్రితమే ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత చైన్నైలోని నివాసం నుంచి కారులో మూడు గంటలు ప్రయాణించి తిరుపతి చేరుకున్నారు. అనంతరం నడక దారిన తిరుమల చేరుకున్నామని కొద్ది రోజుల క్రితం ఆమె వెల్లడించారు. తిరుమల దేవాలయమంటే తనకెంతో ఇష్టమని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఓ వైపు సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు జాన్వీకపూర్. ఈ నేపథ్యంలోనే తాజాగా మధురానగర్​ ఆంజనేయస్వామిని ఆమె దర్శించుకున్నారు. మరోసారి తనకు దైవభక్తి ఎక్కువని చాటుకున్నారు.

అచ్చ తెలుగు స్పీచ్​తో ఆడియెన్స్​ ఫిదా! జాన్వీకి తారక్ ఫ్యాన్స్ పెట్టిన నిక్ నేమ్ ఏంటంటే? - Janhvi Kapoor Devara Pre Release

'దేవర' - జాన్వీ కపూర్​ యాక్టింగ్​పై ఆమె బాయ్​ ఫ్రెండ్ కామెంట్స్​ - ఏమన్నాడంటే? - Devara Janhvi kapoor Boyfriend

Last Updated : Nov 7, 2024, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.