ETV Bharat / state

వైఎస్ విజయమ్మ లేఖపై జగన్ వర్రీ !

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా జగన్, షర్మిల ఆస్తుల వాటాల అంశం

JAGAN WORRY TO VIJAYAMMA LETTER
JAGAN WORRY TO VIJAYAMMA LETTER (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Jagan Worry on YS Vijayamma Open Letter : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వాటాల అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ మూడు రోజుల పర్యటన కోసం జగన్‌ ఇడుపులపాయ చేరుకున్నారు. పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ఆయన దృష్టి సారించారు. ఈ సమయంలోనే విజయమ్మ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తల్లి విడుదల చేసిన లేఖపై ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో జగన్‌ చాలా సేపు ఏకాంతంగా మదన పడినట్లు సమాచారం.

వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి చెక్‌ పెట్టేందుకు వైఎస్సార్సీపీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఈ నియోజకవర్గంలో గత ఐదేళ్ల నుంచి సుధీర్​రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు పార్టీ ముఖ్యనేతలు రాజీ చేసినా దారికి రాలేదు.

Jagan Pulivendula Tour : మాజీ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి వ్యవహారశైలి వైఎస్సార్సీపీ నష్టం చేకూర్చేలా ఉందని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ సమయంలోనే మూడు రోజుల పర్యటన కోసం ఇడుపులపాయ వచ్చిన జగన్ ముందు తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత నేతల పంచాయితీ ఆయన వద్దకు చేరింది. సుధీర్​రెడ్డి , ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అనుచరులతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా చెరి మూడు మండలాలు చూసుకోవాలని జగన్ సూచించారు. కొండాపురం, ముద్దనూరు, యర్రగుంట్ల మండలాలకు మాజీ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ఇంఛార్జ్​గా ఉండాలని మిగిలిన జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాలను రామసుబ్బారెడ్డి చూసుకోవాలని ఆదేశించారు. దీనిపై అలక వహించిన సుధీర్​రెడ్డి బయటికి వెళ్లేందుకు యత్నించారు. 3 మండలాలు తీసుకుంటే సరే లేదంటే నీ ఇష్టం సుధీర్ అని జగన్ ఘాటుగానే బదులిచ్చినట్లు సమాచారం. దీంతో వెనక్కి తగ్గిన ఆయన మౌనం వహించి బయటికి వచ్చారు. రెండురోజుల్లో కడప ఎంపీ అవినాష్​రెడ్డి జమ్మలమడుగు పంచాయితీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

నేతల పంచాయితీ నడుస్తున్న సమయంలోనే తల్లి విజయమ్మ షర్మిల, జగన్‌కు మధ్య తలెత్తిన ఆస్తుల వాటాల అంశంపై బహిరంగ లేఖ విడుదల చేశారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని ఆమె లేఖలో తేల్చేశారు. తల్లి బహిరంగ లేఖపై చాలా సేపు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో జగన్ ఏకాంతంగా మదన పడినట్లు సమాచారం. ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి పులివెందుల బయల్దేరిన ఆయన మార్గమధ్యలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వాహనం దిగి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయింపు జరిగితే కూటమి ప్రభుత్వం వెనక్కి పంపిందని ఆరోపించారు. తర్వాత పులివెందుల కార్యాలయానికి చేరుకున్న జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.

'జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి' - వైఎస్సార్​ అభిమానులకు విజయమ్మ బహిరంగలేఖ

అన్నగా, మేనమామగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే - జగన్​కు షర్మిల కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.