ETV Bharat / state

'మధుసూదన్​ రావు గుర్తుకు పెట్టుకో ఎల్లకాలం ఇదే మాదిరి ఉండదు' - పోలీస్​ అధికారికి జగన్​ హెచ్చరిక - jagan warns police

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 4:49 PM IST

Jagan Warning to Police Officer : విధి బలీయమైనది. మనమే బలహీనులం. ఈ విషయం ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో జ్ఞానోదయం అవుతుంది. ఐదేళ్లు అధికారంలో విర్రవీగిన జగన్​ జనం కర్రుకాల్చి వాత పెట్టినా ఆ విషయాన్ని ఇంకా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా, కారులో నేరుగా అసెంబ్లీకి వచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించినా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సీఎం హోదాలో నలుపు రంగు వాసనే పడని జగన్ అదే రంగు కండువాలతో అసెంబ్లీకి రావడం విధి బలీయమైనదన్న వాస్తవాన్ని గుర్తుచేస్తోంది.

Jagan Warning to Police
Jagan Warning to Police (ETV Bharat)

Jagan Warning to Police Officer : ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే వైఎస్సార్సీపీ అధినేత జగన్​ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. ఫేక్‌ పాలిటిక్స్‌ను నమ్ముకున్న జగన్ అసెంబ్లీ ఆవరణ సాక్షిగా పోలీసులను బెదిరించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయని పలువురు నేతలు పేర్కొన్నారు. ప్రజలు ఛీ కొట్టినా జగన్​ మారలేదని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా నల్ల కండువాలు ధరించి వచ్చిన జగన్​ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లోపలకి ప్లకార్డులు తీసుకువెళ్లడాన్ని పోలీసులు అడ్డుకోగా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఎమ్మెల్యేల దగ్గర్నుంచి, ఎమ్మెల్సీల దగ్గర్నుంచి ప్లకార్డులు గుంజుకుని, లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్​ రావు గుర్తుపెట్టుకో! ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీదున్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్​ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి." - జగన్​, పులివెందుల ఎమ్మెల్యే

జగన్ చెవిలో రఘురామకృష్ణ గుసగుసలు - ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ - ys jagan raghu rama conversation

సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమితమైన వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ప్రతిపక్ష హోదా లేకున్నా జగన్ వాహనాన్ని అసెంబ్లీ లోపలికి అనుమతించాలని స్పీకర్​ నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలంతా గేట్ నెంబర్ 4 బయటే కారు దిగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని జగన్​ వాడుకోకపోగా నిందలు వేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చిన ఆయన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో కదిలారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

నలుపంటేనే అస్సలు గిట్టని జగన్​ అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే నల్ల కండువా వేసుకుని రావడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో జగన్​ సభలకు నల్ల దుస్తులు ధరించిన వారిని కూడా అనుమతించకపోవడం తెలిసిందే. బురఖా ధరించిన ముస్లిం మైనార్టీ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. జగనన్న విద్యాదీవెన సభకు బురఖాతో వచ్చిన విద్యాశాఖ ఉద్యోగిని ఒకరు పోలీసులు అడ్డుకోవడంతో అవాక్కయ్యారు. బురఖా తొలగించి హ్యాండ్​ బ్యాగులో పెట్టుకుని వెళ్దామనుకున్నా బ్యాగును కూడా అనుమతించకపోవడంతో ఆమె సభకు దూరంగా ఉండిపోయారు. జగన్​ సభలు, పర్యటనల్లో పోలీసులు విధించిన ఆంక్షల విషయంలో ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఏపీ మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు - CASE AGAINST AP EX CM JAGAN

'నాడు పరదాలు, ఆంక్షలు - నేడు పలకరింపులు, సెల్ఫీలు' - ఇంతలోనే 'మావయ్య'లో ఎంత మార్పు? - YS Jagan Pulivendula Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.