ETV Bharat / state

'ఈ దాహం తీరనిది!' వచ్చే ఏడాది అప్పులూ ఇప్పుడే- ₹20వేల కోట్ల రుణానికి జగన్​ సిద్ధం - YCP govt take loans

Jagan Govt Ready to Take Huge Loans Before Elections: అప్పుల సర్కార్‌గా పేరు తెచ్చుకున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు భారీగా రుణ సమీకరణకు సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ఉండగానే హడావిడిగా కేంద్రం నుంచి అప్పులకు అనుమతులు తీసుకుంది. ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్ వరకు ఏకంగా 20వేల కోట్ల రూపాయలు అప్పు కావాలని ఆర్బీఐకి సమాచారం పంపింది. ఏడాది మొత్తానికి తీసుకోవాల్సిన అప్పుల్లో మూడో వంతు అప్పు మొదటి 2 నెలల్లోనే తీసుకుని కొత్త ప్రభుత్వం నెత్తిన శఠగోపం పెట్టబోతోంది.

ycp_govt_loans
ycp_govt_loans
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 8:22 AM IST

Jagan Govt Ready to Take Huge Loans Before Elections: ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడే వరకూ అధికారంలోకి ఎవరు వస్తారో తెలియదు. అయినా ఏప్రిల్, మే నెల్లోనే 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలన్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ అప్పులకు అనుమతులు ఇచ్చేందుకు సమయం పడుతుంది. దాదాపు ఏప్రిల్ మూడో వారానికి రాష్ట్ర నికర రుణ పరిమితి తేల్చి, వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎంత రుణం ఇవ్వనున్నదీ తేల్చిచెబుతుంది.

ఆ మేరకు తొలి 9 నెలల్లో ఎంత తీసుకోవచ్చో ఆ మేరకు అనుమతి ఇస్తుంది. ఐతే నెలకు ఇంతే తీసుకోవాలనే పరిమితి విధించదు. గతేడాది రుణాల అనుమతులు రావడానికి ఏప్రిల్లో చాలా ఆలస్యమయింది. జీతాల చెల్లింపులకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి ముందే స్పందించారు. కానీ, వచ్చే ప్రభుత్వం పొందాల్సిన అప్పుల్లో సింహభాగం ముందే తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 2న 4వేల కోట్ల రూపాయల రుణం పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థికశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు.

అప్పుడు అప్పులు, ఇప్పుడు అపర కోటీశ్వరుడు - అక్రమార్జనలో దూసుకుపోతున్న వైసీపీ నేత - YSRCP Leaders Irregularities

అనుమతులు ఉన్నాయా: రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో 3.5శాతం మొత్తానికి కేంద్రం ప్రతి ఏటా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది. విద్యుత్తు సంస్కరణలు, ఇతర రూపేణా మరో 0.5శాతం వరకు అనుమతులు ఇస్తోంది. ఈ నికర రుణపరిమితి లెక్క తేల్చే క్రమంలో ఇతరత్రా రూపాల్లో తీసుకునే మొత్తాలు మినహాయిస్తుంది. గతంలో అదనంగా పొందిన అప్పుల మొత్తాలను ఏడాదికి ఇంత చొప్పున మినహాయిస్తోంది. కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు ఇందులో కలపాలి.

అన్ని రుణాలు కలిపే నికర రుణ పరిమితి అవుతుందని రిజర్వుబ్యాంకు, ఆర్థిక సంఘం గతంలోనే తేల్చి చెప్పాయి. కార్పొరేషన్ల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నా అవి ఇందులో కలిపి లెక్కిస్తున్న దాఖలాలు లేవు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా సుమారు 50వేల కోట్ల రూపాయల వరకు కొత్త అప్పులకు అనుమతులు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. కేంద్రఆర్థికశాఖ ఎంతవరకు అనుమతి ఇచ్చిందన్నది ఇంకా తేలలేదు.

కౌలు రైతుల కష్టాలు - రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కొర్రీలు - Government Not support Farmers

ఎన్నికల్లో లబ్ది పొందేలా వ్యూహం: అనేక ప్రభుత్వ పథకాలను ఎన్నికల కోడ్ వచ్చేలోపే ప్రభుత్వం అమలుచేయాలి. ఆలోపు బటన్ నొక్కి పథకాలు అమలుచేసినట్లు చూపినా అనేక మందికి ఆ మొత్తాలు ఇంకా అందలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ డబ్బులు అందజేసేలా అధికారపార్టీ ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాల్లో కొంత మొత్తం లబ్దిదారులకు చేరవేసి, పరోక్షంగా ఎన్నికల్లో లబ్ది పొందేలా వ్యూహం రూపొందించినట్లు కనిపిస్తోంది.

'ఈ దాహం తీరనిది!' వచ్చే ఏడాది అప్పులూ ఇప్పుడే- ₹20వేల కోట్ల రుణానికి జగన్​ సిద్ధం

వీటితో పాటు అధికారపార్టీ అనుయాయులకు బిల్లులు చెల్లించి, ఆ సొమ్మును ఎన్నికల్లోకి ప్రవహింప జేసే వ్యూహమూ అమలు చేయబోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ రుణాలకు అనుమతులు ఇచ్చినా ఎన్నికల తరుణంలో ఒకేసారి 20వేల కోట్ల రూపాయల రుణాలకు అనుమతించకుండా నెలవారీ పరిమితులు విధించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దుబారా కొండంత- ఆస్తుల సృష్టి గోరంత! ఉపయోగం లేని వాటికే అత్యధిక వ్యయం

మరోవైపు ఏపీ మారిటైం బోర్డు పేరుతో మరో 3,900 కోట్ల మేర కొత్త అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించిన దస్త్రాలు వేగంగా కదులుతున్నాయి. మచిలీపట్నం పోర్టు కోసం 1,688 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాన్ని తీసుకురాబోతోంది. పోర్టు భూములను తాకట్టు పెట్టడానికి వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.