ETV Bharat / state

మధ్య తరగతికి జగనన్న స్మార్ట్‌ మోసం - అమరావతిలో ప్లాట్లు కొన్నవారికి కష్టాలు - Amaravati Township

Jagan Government Scam in Amaravati Township Layout: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను జగన్‌ ప్రభుత్వం చిదిమేసింది. పైసా పైసా కూడబెట్టుకుని సొంత ప్లాట్‌ కొనుక్కొందాం అనుకున్న సామాన్యుల ఆశలను వమ్ము చేసింది. ప్లాట్‌ ధరలో 60 శాతం మొత్తానికే రిజిస్ట్రేషన్‌ చేయించనున్నట్లు సీఆర్డీఏ చేసిన ప్రకటన డొల్లేనని తేలిపోయింది. ఛార్జీల్లో ఎలాంటి రాయితీ లేదంటూ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఆపేయడంతో కొనుగోలుదారులకు జగనన్న స్మార్ట్‌ మోసం అర్థమైంది. సీఆర్డీఏ కమిషనర్‌ కానీ, ఎస్టేట్స్‌ జేడీ కానీ సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ప్లాట్లు కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

amaravati_township
amaravati_township
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 9:31 AM IST

మధ్య తరగతికి జగనన్న స్మార్ట్‌ మోసం - అమరావతిలో ప్లాట్లు కొన్నవారికి కష్టాలు

Jagan Government Scam in Amaravati Township Layout: ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’ పథకంలో భాగంగా 2022 జనవరిలో సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో లే ఔట్‌ వేశారు. మధ్య ఆదాయ వర్గాల నుంచి నివాస ప్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం సమీపంలోని టౌన్‌షిప్‌లో 68.26 ఎకరాల్లో 386 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. వీటిలో 240 చదరపు గజం విస్తీర్ణం గలవి 264, 200 చదరపు గజాలవి 122 ఉన్నాయి.

చదరపు గజం ధర 17 వేల 499గా నిర్ణయించారు. స్పందన పెద్దగా రాకపోవడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పురపాలక శాఖ పలు రాయితీలు ప్రకటించింది. డబ్బు ఏకమొత్తంలో చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్‌, అమ్మకం ధర రిజిస్ట్రేషన్‌లో 40 శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. ఈ ప్రకటన తర్వాత 258 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 133 ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ పూర్తికాగా, ఇంకా 125 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ దాదాపు నెలన్నరగా నిలిచిపోయింది. పూర్తిస్థాయిలో స్టాంపు డ్యూటీ చెల్లించనిదే రిజిస్ట్రేషన్‌ చేయబోమంటూ ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

తాగునీటి కోసం అల్లాడుతున్న గుడివాడ ప్రజలు - చెరువులను గాలికొదిలేసిన అధికారులు - drinking water problem in gudivada

ప్లాటు అమ్మకం ధరను ప్రభుత్వం రెండుగా విభజించింది. 60 శాతాన్ని ప్లాట్‌ ధరగా, మిగిలిన 40 శాతాన్ని అభివృద్ధి ఛార్జీలుగా పేర్కొంది. మొత్తం ధరలో 60 శాతానికే స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుందని, అందులోనూ 40 శాతం రాయితీ అని ప్రకటనలిచ్చింది. తీరా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ సమయం వచ్చేసరికి పూర్తిగా చెల్లించాలని మెలిక పెట్టడంపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. రాయితీపై 2022 సెప్టెంబరు 23న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఇచ్చిన ఉత్తర్వులకు విలువ లేకుండా పోయింది. మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చేసిన రిజిస్ట్రేషన్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆ 40 శాతం స్టాంపు డ్యూటీ కూడా చెల్లించాలా? చెల్లించాల్సి వస్తే, ఎవరు భరించాలని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.

ఏటా పన్నులు పెంచుతాం-సౌకర్యాలు అడగొద్దు! నెల్లూరు కార్పొరేషన్ తీరుపై నగరవాసుల ఆగ్రహం - YCP Govt Imposing Unnecessary Taxes

ప్లాటు కొనుగోలుకు దరఖాస్తు చేసినప్పుడే దాని విలువలో 10 శాతం చెల్లించాలి. ప్లాట్‌ కేటాయించిన నెలలోపు ఒప్పందం ఉంటుంది. తర్వాత నెలలోపు 30 శాతం, ఆరు నెలలకు మరో 30 శాతం, ఏడాదికల్లా లేదా రిజిస్ట్రేషన్‌ వేళ మిగిలిన 30 శాతం డబ్బు చెల్లించాలి. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరి తీసుకొని అమరావతి నిర్మాణాన్ని ఆపేసినప్పటికీ, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, అమరావతికి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు కొన్నారు. ప్లాట్‌ ధరను పూర్తిగా సీఆర్డీఏకు చెల్లించినా కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినా బ్యాంకులకు నెలవారీ పద్దులు కట్టాల్సి వస్తోంది.

వైఎస్సార్సీపీ నేత దాష్టికం- కాలిన గాయాలతో బయటపడిన ఒంటరి మహిళ! నామమాత్రపు సెక్షన్లతో కేసు - YSRCP Leader Attack on Women

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.