ETV Bharat / state

పరిశీలన, పారదర్శకత లేకుండానే చెల్లింపులు - అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు - Payment of Bills Without Screening - PAYMENT OF BILLS WITHOUT SCREENING

Payment of Bills Without Screening: ఎన్నికల కోడ్ కూసింది. ప్రభుత్వ నిర్ణయాల పర్యవేక్షణకు స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటైంది. నిప్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీతో అంటకాగుతున్నారు. ఎలాంటి స్క్రీనింగ్‌ లేకుండానే అధికార పార్టీ అనుయాయులకు బిల్లులు చెల్లిస్తున్నారు.

Payment_of_Bills_Without_Screening
Payment_of_Bills_Without_Screening
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:12 AM IST

స్క్రీనింగ్ లేకుండానే 2వేల కోట్ల చెల్లింపులు- అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు

Payment of Bills Without Screening: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్క్రీనింగ్‌ లేకుండానే 2,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగిపోయాయి. పారదర్శకత ఆస్కారమే లేకుండా మార్చి 16 నుంచి 26 లోపు చెల్లింపులు జరిగాయి. ఆర్థికశాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న కార్యదర్శి కె.వి.వి. సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి మార్చి 16న రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చి 18న జీవో 607 విడుదల చేసింది.్

ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఒక స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ప్రతిపాదన, ప్రతి సిఫార్సును ఈ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికల సంఘానికి సమర్పించాలి. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన, చర్చ ముఖ్యం. కానీ కీలకమైన ఆర్థిక బిల్లుల చెల్లింపులో ఎలాంటి పరిశీలన, పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పది అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ - BJP AP MLA Candidates List

ఈ పరిశీలన కమిటీలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శికి ఏ ఫైళ్లూ పంపడం లేదని, ఆయన్ను పక్కనపెట్టి నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సమాచారం. 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం అమలు చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఏ బిల్లు చెల్లించాలన్నా ఫస్ట్‌ ఇన్‌, ఫస్ట్‌ అవుట్‌ విధానం అనుసరించింది. మొదట వచ్చిన బిల్లు మొదట చెల్లించాలి. ఆ తర్వాత వరుస క్రమంలోనే బిల్లులు చెల్లింపులు జరగాలి.

ఒక విధానం ప్రకారం బిల్లులు చెల్లిస్తుండటంతో గుత్తేదారులు, సరఫరాదారులు నేడో, రేపో సొమ్ములు వస్తాయనే నమ్మకంతో పనులు చేసేవారు. జగన్‌ ప్రభుత్వం ఈ విధానానికి తిలోదకాలు ఇచ్చింది. ఫస్ట్‌ ఇన్‌, ఫస్ట్‌ అవుట్‌ విధానంలో చెల్లింపుల్లో పారదర్శకత ఉండేది. బిల్లుల సమర్పణలో, వాటిని ఆమోదించడంలో అవినీతిని నియంత్రించేందుకు అవకాశం ఉండేది. జగన్‌ సర్కార్‌ ఈ విధానం ఎత్తివేసి, ఇష్టమైన వారికే బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.

ఎప్పుడో కొవిడ్‌ నాటి బిల్లులూ గుత్తేదారులకు, సరఫరాదారులకు ఇంకా పెండింగ్‌ ఉన్నాయి. అధికార పార్టీతో అంటకాగుతున్న ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ బిల్లుల చెల్లింపుల్లో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఇప్పటికీ కావల్సిన వారికే చెల్లింపులు సాగుతున్నాయి. ఆ నిధులు తిరిగి మళ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనువుగా ఖర్చు చేసేందుకు తోడ్పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో బిల్లుల చెల్లింపులపై ఎన్నికల సంఘం తగిన ఆదేశాలివ్వాలని గుత్తేదారులు, సరఫరాదారులు కోరుతున్నారు.

రావణాసురుడి పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు - Madanapalle Praja Galam meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.