Jagan Government Neglects Inam Lands Issue: 2019 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే ఇనాం భూముల సమస్యలు పరిష్కరిస్తానని చిలకలూరిపేట వేదికగా జగన్ చిలుకపలుకులు పలికారు. ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్నా ఆ దిశగా అడుగు ముందుకువేయలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6వేల 700 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 4వేలు, ప్రకాశం జిల్లాలో 3,600ఎకరాలు నిషేధిత జాబితాలో చేరాయి. కృష్ణా జిల్లాలో 3,500, కడప జిల్లాలో 3,500, ఉభయగోదావరి 2,500, అనంతపురం 400, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 180 ఎకరాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లోని ఇనాం భూముల్లో భవంతులు, దుకాణాలు వెలిసి ధరలు భారీగా పెరిగాయి.
తక్కువ వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధత ఎలా? - ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం
క్రయవిక్రయాలు స్తంభించి అవసరాలకు అమ్ముకోలేక వాటి యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ వరాహ శ్రీలక్ష్మీనరసింహస్వామి, రామాయపట్నం జనార్దనస్వామి ఆలయాలకు చెందిన 1500ఎకరాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. సోమరాజుపల్లి, సింగరాయకొండ గ్రామాల వరకు విస్తరించి ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన భూములను ఏడు దశాబ్దాల క్రితం ఆలయ సేవకులకు కేటాయించారు. సీఆర్ కాలనీ, బోస్ రోడ్డు, సుబ్బయ్య తోట, బాలాజీ థియేటర్ తదితర ప్రాంతాల్లోని స్థలాలు నిషిద్ధ జాబితాలో చేరాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంతాల్లోని రామలింగేశ్వరస్వామి, మదన గోపాలస్వామి ఆలయాలకు చెందిన వెయ్యి ఎకరాలు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పాఠశాలలు, భవనాలు నిర్మించారు. జగ్గయ్యపేటలో శివాలయం, రంగనాయకుల దేవాలయాలకు చెందిన సుమారు 400 ఎకరాల భూములు నిషిద్ధ జాబితాలో చేరాయి. నిలిచిన క్రయ విక్రయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు వాపోతున్నారు.
'డబ్బు'ల్ ధమాకా! వాలంటీర్ల నగదు పురస్కారం రెట్టింపు - సీఎం జగన్ మాస్టర్ ప్లాన్
స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, జమిందారులు, ఆలయాలకు సేవలు అందించే వారికి జీవనోపాధి కోసం సాగు భూములను ఇనాంగా ఇచ్చేవారు. రాచరిక, జమిందారీ వ్యవస్థలు రద్దు అవడంతో 1956లో అప్పటి ప్రభుత్వం ఇనాం చట్టం తెచ్చింది. అర్హులకు అధికారులు రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా 2013లో ‘ఇనామ్ ల్యాండ్ ఎబాలిషన్’ చట్టానికి సవరణ చేసింది. సవరణలోని నిబంధనను 1956 నుంచి జరిగిన లావాదేవీలకు వర్తింపజేయడంతో అప్పటికే చేతులు మారిన భూములు నిషిద్ధ జాబితాలోకి వెళ్లాయి. చట్టంలో ‘ప్రాస్పెక్టివ్’కు బదులుగా ‘రెట్రాస్పెక్టివ్’అని పేర్కొనడంతో వాటి క్రయవిక్రయాలు స్తంభించాయి.
ఇందూటెక్‌కు భూములు- టక్కుటమార విద్యలతో జగన్ కంపెనీలకు నిధులు! సీబీఐ చార్జిషీట్‌పై 234 వాయిదాలు
ఈ నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టూ రైత్వారీ అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్-2019’ పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ తెచ్చింది. దీని ప్రకారం 2013కు ముందు ఇచ్చిన పట్టాలు ఆర్డినెన్స్ ప్రకారం చెల్లుబాటు అవుతాయి. ఇనాం సర్వీసు భూముల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉమ్మడి జాబితాలో ఉన్నందున అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. దీనికి చట్టబద్ధత కల్పించడం మాత్రమే మిగిలి ఉండగా తెలుగుదేశానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈలోపు ఆర్డినెన్స్ జారీ గడువు ముగిసిపోయి ఇనాం భూముల సమస్య మళ్లీ మొదటికొచ్చింది.