Jagan Cheated Elderly by Would Build Old Age Home: మామూలు జనాన్నే తలలు నిమురుతూ తన నటనాచాతుర్యంతో జగన్ కట్టిపడేస్తారు. వృద్ధులంటే ఇక చెప్పేదేముంది అవ్వాతాతలంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అవసరం తీరాక అపరచితుడిలా మారిపోతారు. మండలానికో వృద్ధాశ్రమం కట్టిస్తానంటూ గత ఎన్నికల్లో ఎంతోమంది పండుటాకులకు ఆశలు కల్పించిన జగన్ ఒక్కటీ నిర్మించకుండా మళ్లీ ఓట్ల వల విసురుతున్నారు.
ప్రతిపక్షనేతగా పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజే అవ్వతాతలకు మండలానికో వృద్ధాశ్రమం కట్టిస్తానంటూ జగన్ మాటిచ్చారు. పాపం వృద్ధులు ఆయన మాటలు నమ్మి ఓట్లేశారు. ఐదేళ్లు అధికారం అనుభవించారు. కానీ నాడు చెప్పిన మాటలే మర్చిపోయారు. మండలానికో వృద్ధాశ్రమం కాదు కదా కనీసం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక్కటీ ఏర్పాటు చేసింది లేదు. చేసిందే చెప్తా, చెప్పిందే చేస్తా అనే జగన్‌కు ఇది గుర్తుందో లేదో అనే సందేహం కలుగక మానదు.
ఉపాధి, ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత వెళ్తున్నారు. కొన్ని గ్రామాల్లో 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే యువతే కనిపించదంటే అతిశయోక్తి కాదు. ఈ కారణంగా ప్రతి గ్రామంలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉండిపోతున్నారు. వీరిలో ఒంటరి వృద్ధుల సంఖ్య ఎక్కువే. ఇక ఏ ఆదరవూ లేని వారు బిడ్డలు పట్టించుకోని వారూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వారు జగన్ మాటల్ని నమ్మి మోసపోయారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమాలు 68 ఉన్నాయి. వృద్ధుల సంఖ్యకు అనుగుణంగా వీటికి కేంద్రమే గ్రాంటును విడుదల చేస్తుంది. మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో రెండు వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఇవి ఉన్నాయి.
ఇందూ- హౌసింగ్ బోర్డు కేసులో వైవీపై సృష్టమైన ఆధారాలున్నాయి : తెలంగాణ హైకోర్టు - MP YV SUBBAREDDY
జగన్ చెప్పినట్లే మండలానికో వృద్ధాశ్రమం నిర్మించి ఉంటే ఈపాటికి రాష్ట్రంలోని 660 మండలాలకు 660 వృద్ధాశ్రమాలు రావాలి. ఐదేళ్లులో ఒక్కటీ ఏర్పాటు కాలేదు. రాష్ట్రంలో ప్రైవేటుగానూ కొన్ని వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 18 ఉన్నాయి. ప్రైవేటు వృద్ధాశ్రమాల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు కేంద్రాలే నడుస్తుంటే కచ్చితంగా వాటి అవసరం ఉన్నట్లే కదా.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రమాలు లేవు. ఈ ఐదు జిల్లాల్లో 150 మంది చొప్పున ఉండేలా వృద్ధాశ్రమాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఏడాదిగా వైకాపా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ దస్త్రాన్ని జగన్ కనీసం పరిగణలోకి కూడా తీసుకోకపోవడం అవ్వతాతల్న జగన్ చేసిన ఘరానా మోసం.
వైసీపీకి వరుస షాక్‌లు - ఓ వైపు రాజీనామాల పర్వం, మరోవైపు అసమ్మతి సెగలు - YSRCP Leader Resigned