ETV Bharat / state

లోకేశ్ దిల్లీ టూర్ అప్డేట్స్ - 'ఇతర రాష్ట్రాలతో కాదు- దేశాలతోనే మాకు పోటీ' - NARA LOKESH DELHI TOUR

రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా వివిధ భేటీలు

Nara Lokesh Delhi Tour
Nara Lokesh Delhi Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 7:10 AM IST

Nara Lokesh Visit Delhi : దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకుని స్పీడ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా లోకేశ్ వరుసగా రెండో రోజు దిల్లీలో కేంద్ర పెద్దలు, వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్‌ ప్రతినిధులతో పాటు ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మహీంద్ర అధ్యక్షతన భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, ఏపీ అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. తరచూ వారితో సమావేశమై విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేగవంతమైన అనుమతులకు ఈడీబీని పునరద్ధరించామని, సరైన ప్రతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ఇతర దేశాలతోనూ పోటీపడుతున్నామని లోకేశ్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అందుకే ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పారిశ్రామిక వేత్తల కోసం టైలర్‌ మేడ్‌ పాలసీలను రూపొందిస్తామని పేర్కొన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చేందుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను లోకేశ్ కోరారు.

సహకారం అందించాలి : తిరుపతిలో ఇప్పటికే డిక్సన్‌, డైకిన్‌, టీసీఎల్ కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేశాయని లోకేశ్ వివరించారు. అనంతపురంలో కియా మోటార్స్‌ ఇప్పటికే పనిచేస్తోందని చెప్పారు. అనంతపురంతో పాటు కర్నూలు జిల్లాలోనూ అటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ, ఈవీ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధికి సహకారం అందించాలని పారిశ్రామికవేత్తలను లోకేశ్​ కోరారు.

రాష్ట్రంలో చేపట్టిన నైపుణ్యాభివృద్ధి, దేశంలో మొదటిసారి జరుగుతున్న నైపుణ్య గణనకు సహకారం అందించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్‌ సింగ్‌, అధికారులను లోకేశ్ కోరారు. నైపుణ్యాభివృద్ధి లక్ష్యం, ఎలా చేపడుతున్నారని కేంద్రమంత్రి ఆరా తీయగా లోకేశ్​ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. పీపీపీ పద్ధతిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ అమరావతిలో నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.

Nara Lokesh on Skill Senses : ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కేటాయింపులు సహా జాతీయ నైపుణ్యాభివృద్ధి వెబ్‌సైట్లతో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ని అనుసంధానం చేయాలని లోకేశ్​ కోరారు. గిరిజన నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని విన్నవించారు. మంగళగిరిలో జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ, అమరావతిలో నిర్మాణ రంగం, కర్నూలులో రెన్యూవబుల్‌ ఎనర్జీ, చేనేత, హస్తకళలు, విశాఖలో ఫార్మా ల్యాబ్స్‌, నెల్లూరు, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలు నెలకొల్పేందుకు స్కిల్‌ కౌన్సిల్‌ సహకారం అందించాలని లోకేశ్​ కోరారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం - విద్య, ఉపాధి కల్పనపై లోకేశ్ ప్రత్యేక దృష్టి

ఏపీ పెట్టుబడుల స్వర్గధామం - పెట్టుబడిదారులకు వాట్సప్​లో అప్​డేట్స్ : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.