Pratibha Award to ISRO Chairman Somnath: వచ్చే పాతికేళ్లలో దేశ భవిష్యత్తు - అంతరిక్ష ఆశయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఓ రోడ్‌మ్యాప్‌ను సూచించారని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. 2035 నాటికి భారతదేశం రూపొందించిన, స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2040 నాటికి చంద్రునిపైకి భారతీయుడిని దింపాలనే దిశగా ఇస్రో పరిశోధనలు సాగించాలనేది తమ ముందున్న కర్తవ్యమని అన్నారు.
'చంద్రుడిపై నుంచి రాళ్లు తీసుకురావడమే టార్గెట్- అది అంత ఈజీ కాదు'
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రతిభా పురస్కారం: విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో డాక్టర్ పిన్నమనేని - సీతాదేవి ఫౌండేషన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌కు ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫౌండేషన్ ఛైర్మన్ చదలవాడ నాగేశ్వరరావు, ఇతర సభ్యులు ఈ పురస్కారాన్ని అందించారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తొలిసారి తాను విజయవాడ వచ్చానని, మున్ముందు విద్యార్ధులపై శాస్త్ర పరిశోధనలపై అవగాహన కలిగించేందుకు వస్తానని అన్నారు.
చంద్రయాన్-3 విజయం ఒక్క రోజులోనో ఒక్క ఏడాదిలోనో సాధ్యమైంది కాదు. అనేక సంవత్సరాల పరిశోధనలు - లోపాలపై సమీక్షలు - శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇస్రోలోని సిబ్బంది అందరి సమష్టి అకుంఠిత శ్రమ. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ప్రయోగం సఫలం కావాలనే ఆకాంక్ష చంద్రయాన్-3 విజయతీరానికి చేర్చింది. -సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
కృష్ణ బిలాల గుట్టు ఎక్స్‌పోశాట్‌లో- ఇకపై నెలకో కొత్త ప్రయోగం: ఇస్రో చైర్మన్ సోమనాథ్
చంద్రుని అన్వేషణ కోసం చంద్రయాన్ మిషన్‌లు: త్వరలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరగబోతోందని సోమనాథ్ పేర్కొన్నారు. ఇటీవల చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్‌లతో సహా భారతీయ అంతరిక్ష కార్యక్రమాల విజయవంతం వెనక అనేక మంది పరిశోధనల ఫలితాలు ఉన్నాయని, వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రుని అన్వేషణ కోసం చంద్రయాన్ మిషన్‌లు కొనసాగుతాయన్నారు. శుక్రుడి చుట్టూ తిరిగేందుకు అంతరిక్ష వాహనం, అంగారక గ్రహంపై దిగే వాహనంతో సహా అంతర్ గ్రహ మిషన్ల కోసం కృషి చేయబోతున్నట్లు సోమనాథ్ వెల్లడించారు.
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు క్యాన్సర్ - 'సరిగ్గా ఆదిత్య ప్రయోగం రోజే తెలిసింది'